Title (Indic)ఆతఁడు సేసే చేఁత లన్యులు సేయఁగలరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు సేసే చేఁత లన్యులు సేయఁగలరా జాతుల మనుజులెల్లా సతమయ్యేరా (॥ఆతఁ॥) దిక్కులేనివారికెల్లా దేవుఁ డొక్కఁడే దిక్కు చిక్కినవారికినెల్లా శ్రీపతే గతి తక్కిన అనాథులకు దైవమే రక్షకుఁడు యెక్కడా నాతఁ డుండఁగా నేఁటి కిఁక చింత (॥ఆతఁ॥) బలిమి లేనివారికి పరమాత్ముఁడే బలిమి కలిమి చాలనివారి కలిమి హరె యిల నేరనివారికి నిందిరానాథుఁడే నేర్పు వెలసీతనికే విన్నవించుటింతే కాక (॥ఆతఁ॥) పొందులేనివారికెల్లాఁ బురుషోత్తముఁడే పొందు విందును వేడుకయు శ్రీవేంకటేశుఁడే యెందరెందరుండినాను యీతఁడు గలఁడు మాకు సందడి నాతఁడే అన్ని చక్కఁబెట్టీఁ బనులు English(||pallavi||) ādam̐ḍu sese sem̐ta lanyulu seyam̐galarā jādula manujulĕllā sadamayyerā (||ādam̐||) dikkulenivārigĕllā devum̐ ḍŏkkam̐ḍe dikku sikkinavāriginĕllā śhrībade gadi takkina anāthulagu daivame rakṣhagum̐ḍu yĕkkaḍā nādam̐ ḍuṁḍam̐gā nem̐ṭi kim̐ka siṁta (||ādam̐||) balimi lenivārigi paramātmum̐ḍe balimi kalimi sālanivāri kalimi harĕ yila neranivārigi niṁdirānāthum̐ḍe nerbu vĕlasīdanige vinnaviṁchuḍiṁte kāga (||ādam̐||) pŏṁdulenivārigĕllām̐ buruṣhottamum̐ḍe pŏṁdu viṁdunu veḍugayu śhrīveṁkaḍeśhum̐ḍe yĕṁdarĕṁdaruṁḍinānu yīdam̐ḍu galam̐ḍu māgu saṁdaḍi nādam̐ḍe anni sakkam̐bĕṭṭīm̐ banulu