Title (Indic)ఆతఁడు చెప్పినట్ల అండనే కూచుండఁగదే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు చెప్పినట్ల అండనే కూచుండఁగదే రాతిరీఁ బగలు నింత రవ్వసేయఁదగునా (॥ఆత॥) వలపుగలవారికి చలము సాదించరాదు లలిఁ జెప్పినట్టు సేయవలెఁ గాని చెలువుఁడాతఁడు నీపైఁ జేతులు చాఁచఁగాను పెలుచుఁదనాన నింత పెనఁగఁగఁదగునా (॥ఆత॥) తగులు గలచోటికి బిగువు చూపఁగరాదు మొగమిచ్చలే యాడఁ దగుఁ గాని నగుతా నాతఁడు నీకానలు గడుఁబెట్టఁగాను జిగిమించి నీకింత సిగ్గువడఁదగునా (॥ఆత॥) రతివేళ నన్నిటా సమ్మతించక మానరాదు మితిమీరి కూడుటకుఁ దతిగాని ఇతవై శ్రీవేంకటేశుఁ డేలి నిన్ను మెచ్చఁగాను సతమై నీకింతగుట్టు జరపఁగఁదగునా English(||pallavi||) ādam̐ḍu sĕppinaṭla aṁḍane kūsuṁḍam̐gade rādirīm̐ bagalu niṁta ravvaseyam̐dagunā (||āda||) valabugalavārigi salamu sādiṁcharādu lalim̐ jĕppinaṭṭu seyavalĕm̐ gāni sĕluvum̐ḍādam̐ḍu nībaim̐ jedulu sām̐sam̐gānu pĕlusum̐danāna niṁta pĕnam̐gam̐gam̐dagunā (||āda||) tagulu galasoḍigi biguvu sūbam̐garādu mŏgamichchale yāḍam̐ dagum̐ gāni nagudā nādam̐ḍu nīgānalu gaḍum̐bĕṭṭam̐gānu jigimiṁchi nīgiṁta sigguvaḍam̐dagunā (||āda||) radiveḽa nanniḍā sammadiṁchaga mānarādu midimīri kūḍuḍagum̐ dadigāni idavai śhrīveṁkaḍeśhum̐ ḍeli ninnu mĕchcham̐gānu sadamai nīgiṁtaguṭṭu jarabam̐gam̐dagunā