Title (Indic)ఆతఁడు నీవును నేకమైనట్టే వుందురుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీవును నేకమైనట్టే వుందురుగాక యీతలనాతలా బింకాలేల దూసేరే (॥ఆత॥) మచ్చిక చేసినవారు మాటలఁ గొసరుదురు పచ్చిగా నవ్వేటివారు పైకొందురు విచ్చిన విడైనవారు వెఱపు లేకుండుదురు యెచ్చుకుందులు మీలోననేల పట్టేరే (॥ఆత॥) పొద్దువోని యట్టివారు బొమ్మల జంకింతురు వద్దనున్నవారు లోలో వాసి రేఁతురు కొద్దిమీరినట్టివారు గురులు దాఁకింతురు యిద్దరూను పంతాలకు యేల పెనఁగేరే (॥ఆత॥) చనవులు గలవారు సరసాలు చూపుదురు తనియఁ గూడెడివారు తమకింతురు యెనసితిరి శ్రీ వేంకటేశుఁడు నీవును నిట్టే యినుమడించెఁ దగవులేల పెట్టేరే English(||pallavi||) ādam̐ḍu nīvunu negamainaṭṭe vuṁdurugāga yīdalanādalā biṁkālela dūsere (||āda||) machchiga sesinavāru māḍalam̐ gŏsaruduru pachchigā navveḍivāru paigŏṁduru vichchina viḍainavāru vĕṟabu leguṁḍuduru yĕchchuguṁdulu mīlonanela paṭṭere (||āda||) pŏdduvoni yaṭṭivāru bŏmmala jaṁkiṁturu vaddanunnavāru lolo vāsi rem̐turu kŏddimīrinaṭṭivāru gurulu dām̐kiṁturu yiddarūnu paṁtālagu yela pĕnam̐gere (||āda||) sanavulu galavāru sarasālu sūbuduru taniyam̐ gūḍĕḍivāru tamagiṁturu yĕnasidiri śhrī veṁkaḍeśhum̐ḍu nīvunu niṭṭe yinumaḍiṁchĕm̐ dagavulela pĕṭṭere