Title (Indic)ఆతఁడు నీవు నొక్కటె అందరు నెఱుఁగుదురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీవు నొక్కటె అందరు నెఱుఁగుదురు మాతోనె యింతేసి మతకమేలె నీవు (॥ఆతఁడు॥) తప్పక వొట్లువెట్టి దగ్గరి రమ్మనే వేమె చెప్పరాదా నీ మాట సేసేఁ గాని నెప్పున నాతఁడున్నాఁడు నే నెరఁగనా నీ వొద్ద చెప్పక నాతో మాయలు సేయనేలె నీవు (॥ఆతఁడు॥) వట్టి యాకతాలు చెప్పి వద్దికి దగ్గరే విదె అట్టె వుండరాదా అన్నినయ్యీఁ గాని తట్టి ఆతని ముదుల తచ్చనగాఁబోలు నిది నట్టనడుమనె యేఁటి నాటకమె నీవు (॥ఆతఁడు॥) యిచ్చకము సేసి నన్ను యెలయించే విన్నిటాను పచ్చిదేరెఁ బనులెల్ల పదవె యింక చెచ్చెర నన్ను నలమి శ్రీవెంకటేశ్వఁడు గూడె వచ్చె నీ పంతములు నవ్వఁగదె నీవు English(||pallavi||) ādam̐ḍu nīvu nŏkkaḍĕ aṁdaru nĕṟum̐guduru mādonĕ yiṁtesi madagamelĕ nīvu (||ādam̐ḍu||) tappaga vŏṭluvĕṭṭi daggari rammane vemĕ sĕpparādā nī māḍa sesem̐ gāni nĕppuna nādam̐ḍunnām̐ḍu ne nĕram̐ganā nī vŏdda sĕppaga nādo māyalu seyanelĕ nīvu (||ādam̐ḍu||) vaṭṭi yāgadālu sĕppi vaddigi daggare vidĕ aṭṭĕ vuṁḍarādā anninayyīm̐ gāni taṭṭi ādani mudula tachchanagām̐bolu nidi naṭṭanaḍumanĕ yem̐ṭi nāḍagamĕ nīvu (||ādam̐ḍu||) yichchagamu sesi nannu yĕlayiṁche vinniḍānu pachchiderĕm̐ banulĕlla padavĕ yiṁka sĕchchĕra nannu nalami śhrīvĕṁkaḍeśhvam̐ḍu gūḍĕ vachchĕ nī paṁtamulu navvam̐gadĕ nīvu