Title (Indic)ఆతఁడు నీవు నొక్కటైతే నౌదురుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీవు నొక్కటైతే నౌదురుగాక యేతున మమ్మంటకు నేమెవ్వరి లోవారము (॥ఆతఁడు॥) వంతులకుఁ బెనఁగేవు వద్దు సుమీ నీవు నాతో యింత పోరితే నీవే యెఱుఁగుదువు రంతుల నేనేమన్నా రాఁగఁజేసి దూరవద్దు యెంతకెంత సేసేవు నే మెవ్వరిలో వారము (॥ఆతఁడు॥) నేనున్నాడనే వుండేవు నీకిదేమే చలమా కానీ లేవే మీఁదటెత్తు గనుకొనేవు పూని మమ్మురేఁచి వట్టి బూమెలు సేయవద్దు యీ నేరుపులేఁటికి నే మెవ్వరిలోవారము (॥ఆతఁడు॥) నన్నుఁ బేరుకొనకుమీ నాయముగాదు నీకు చిన్నదానవు నేఁజాటి చెప్పితి నీకు యెన్నికెతో శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ గలనె ఇన్నాళ్ళదాఁకాను నే మెవ్వరిలోవారము English(||pallavi||) ādam̐ḍu nīvu nŏkkaḍaide naudurugāga yeduna mammaṁṭagu nemĕvvari lovāramu (||ādam̐ḍu||) vaṁtulagum̐ bĕnam̐gevu vaddu sumī nīvu nādo yiṁta poride nīve yĕṟum̐guduvu raṁtula nenemannā rām̐gam̐jesi dūravaddu yĕṁtagĕṁta sesevu ne mĕvvarilo vāramu (||ādam̐ḍu||) nenunnāḍane vuṁḍevu nīgideme salamā kānī leve mīm̐daḍĕttu ganugŏnevu pūni mammurem̐si vaṭṭi būmĕlu seyavaddu yī nerubulem̐ṭigi ne mĕvvarilovāramu (||ādam̐ḍu||) nannum̐ berugŏnagumī nāyamugādu nīgu sinnadānavu nem̐jāḍi sĕppidi nīgu yĕnnigĕdo śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ galanĕ innāḽḽadām̐kānu ne mĕvvarilovāramu