Title (Indic)ఆతఁడు నీచేతఁ జిక్కె నదివో నేఁడూ నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీచేతఁ జిక్కె నదివో నేఁడూ నీ- యేతులు యెమ్మెలు మరి యేమి చెప్పే మిఁకను (॥ఆత॥) వెన్నెలనవ్వులు నవ్వె వేఁడివేఁడివలపు చన్నులతుదలనె చవుకళించె వయసు కన్నులచూపులనె కాఁడిపారె మనసు యెన్నిలేవు నీసుద్దు లేమిచెప్పే విఁకను (॥ఆత॥) నాలికతుదలనె నానెఁ జుట్టరికము మేలిమిసరసముల మించె మోముకళలు గాలపుగోరికొనల కరఁగె మర్మములు యీలాగుల నీనేరువు లేమిచెప్పే మిఁకను (॥ఆత॥) పెదవిపైఁ గుఱుతులఁ బెరసెఁ గూటములు పొదిగొన్నతమకాన పోగులాయ నాసలు అదన శ్రీవేంకటేశు డలమేలుమంగ నిన్ను- నిదె కూడె మీ భావము లేమిచెప్పే మిఁకను English(||pallavi||) ādam̐ḍu nīsedam̐ jikkĕ nadivo nem̐ḍū nī- yedulu yĕmmĕlu mari yemi sĕppe mim̐kanu (||āda||) vĕnnĕlanavvulu navvĕ vem̐ḍivem̐ḍivalabu sannuladudalanĕ savugaḽiṁchĕ vayasu kannulasūbulanĕ kām̐ḍibārĕ manasu yĕnnilevu nīsuddu lemisĕppe vim̐kanu (||āda||) nāligadudalanĕ nānĕm̐ juṭṭarigamu melimisarasamula miṁchĕ momugaḽalu gālabugorigŏnala karam̐gĕ marmamulu yīlāgula nīneruvu lemisĕppe mim̐kanu (||āda||) pĕdavibaim̐ guṟudulam̐ bĕrasĕm̐ gūḍamulu pŏdigŏnnadamagāna pogulāya nāsalu adana śhrīveṁkaḍeśhu ḍalamelumaṁga ninnu- nidĕ kūḍĕ mī bhāvamu lemisĕppe mim̐kanu