Title (Indic)ఆతఁడు నీమోము చూచీ నప్పటినుండి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీమోము చూచీ నప్పటినుండి చేతులెత్తి మొక్కి యిట్టె సేవ సేయఁగదవే (॥ఆతఁడు॥) పంతములాడఁ దగదు పతితోడ నింతులకు యెంతైనా నిచ్చలాడుటే యెన్నికగాని చింతలోనిది వలపు చేకొన్నది జవ్వనము వింత సేయ కాతనికి విడె మియ్యఁగదవే (॥ఆతఁడు॥) పొరపొచ్చె మేఁటికి పొందైనచో నెవ్వరికి వరుసతో నవ్వు నవ్వవలెఁ గాని పొరిఁ బువ్వులే యమ్ములు బొమ్మలే మరుని విండ్లు విరసము లేఁటికి విడె మియ్యఁగదవే (॥ఆతఁడు॥) సిగ్గుపడ నీఁకేల శ్రీవేంకటేశుతోడ వొగ్గిరతిఁ గూడినదె వొద్దికగాని అగ్గమై వురమెక్కితి వలమేల్ మంగవు నీవు వెగ్గళించె నీ నేరుపు విడెమియ్యఁగదవే English(||pallavi||) ādam̐ḍu nīmomu sūsī nappaḍinuṁḍi sedulĕtti mŏkki yiṭṭĕ seva seyam̐gadave (||ādam̐ḍu||) paṁtamulāḍam̐ dagadu padidoḍa niṁtulagu yĕṁtainā nichchalāḍuḍe yĕnnigagāni siṁtalonidi valabu segŏnnadi javvanamu viṁta seya kādanigi viḍĕ miyyam̐gadave (||ādam̐ḍu||) pŏrabŏchchĕ mem̐ṭigi pŏṁdainaso nĕvvarigi varusado navvu navvavalĕm̐ gāni pŏrim̐ buvvule yammulu bŏmmale maruni viṁḍlu virasamu lem̐ṭigi viḍĕ miyyam̐gadave (||ādam̐ḍu||) siggubaḍa nīm̐kela śhrīveṁkaḍeśhudoḍa vŏggiradim̐ gūḍinadĕ vŏddigagāni aggamai vuramĕkkidi valamel maṁgavu nīvu vĕggaḽiṁchĕ nī nerubu viḍĕmiyyam̐gadave