Title (Indic)ఆతఁడు నీకుఁ దగు నాతనికి నీవు దగు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీకుఁ దగు నాతనికి నీవు దగు గాతలఁ జెలులమెల్లఁ గంటిమి యీ నేర్పులు (॥ఆతఁ॥) కన్నులవాఁడి చూపేవు కమ్మనిమోవి ఇచ్చేవు పన్నేవు మాయలు రెంటా బతితోను నున్నని చెక్కులు నొక్కి నోటనే ప్రియాలు చెప్పి మన్నించె నిన్ను నాతఁడు మారుకు మారుకును (॥ఆతఁ॥) నాటించేవు చన్నులను నవ్వేవు సెలవులను యేఁటికే యీ పగటులు ఇరుదెసలా కూటములు పచరించి గురుతులు సోఁకించి చాటీ వలపతఁడు సరికి బేసికిని (॥ఆతఁ॥) కప్పురపు బాగాలిచ్చేవు కాఁగిట బిగించేవు వొప్పించేవు దారా మోనా నొక్క చోటనే ఇప్పుడే శ్రీ వేంకటేశుఁ డీఁడువెట్టుకొని కూడె తొప్పదోఁగి ముదముల తులదూఁగె నితఁడు English(||pallavi||) ādam̐ḍu nīgum̐ dagu nādanigi nīvu dagu gādalam̐ jĕlulamĕllam̐ gaṁṭimi yī nerbulu (||ādam̐||) kannulavām̐ḍi sūbevu kammanimovi ichchevu pannevu māyalu rĕṁṭā badidonu nunnani sĕkkulu nŏkki noḍane priyālu sĕppi manniṁchĕ ninnu nādam̐ḍu mārugu mārugunu (||ādam̐||) nāḍiṁchevu sannulanu navvevu sĕlavulanu yem̐ṭige yī pagaḍulu irudĕsalā kūḍamulu pasariṁchi gurudulu som̐kiṁchi sāḍī valabadam̐ḍu sarigi besigini (||ādam̐||) kappurabu bāgālichchevu kām̐giḍa bigiṁchevu vŏppiṁchevu dārā monā nŏkka soḍane ippuḍe śhrī veṁkaḍeśhum̐ ḍīm̐ḍuvĕṭṭugŏni kūḍĕ tŏppadom̐gi mudamula tuladūm̐gĕ nidam̐ḍu