Title (Indic)ఆతఁడు నీకంటె జాణఁ డదెఱఁగవా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీకంటె జాణఁ డదెఱఁగవా యేతుల కిన్నిటానేల యెలయించేవే (॥॥) చెక్కునఁ జేయువెట్టుక సెలవుల నవ్వుకొంటా వెక్కుసము లేమాడేవే విభునిని చిక్కనిచెమట గార సిగ్గులనుఁ దొప్పఁ దోఁగి చక్కనిమోమున నేమి సన్న సేసేవే (॥॥) పొదిగి తప్పక చూచి బొమ్మల జంకిచుకొంటా కది మెంతవొరసేవే కాంతునిని మదమున నుప్పొంగి మచ్చికల వెరగంది పొదలుఁ జన్నుల నెంత పూఁచి మదిమేవే (॥॥) బిగువుఁ గాఁగిటఁ గూడి పిప్పిగాఁ బెనఁగుకొంటా వెగటునేతురటె శ్రీ వేంకటేశుని అగపడి చొక్కించి అలమేలుమంగవు నీవు చిగురుమోవితేనె చిందించేవే English(||pallavi||) ādam̐ḍu nīgaṁṭĕ jāṇam̐ ḍadĕṟam̐gavā yedula kinniḍānela yĕlayiṁcheve (||||) sĕkkunam̐ jeyuvĕṭṭuga sĕlavula navvugŏṁṭā vĕkkusamu lemāḍeve vibhunini sikkanisĕmaḍa gāra siggulanum̐ dŏppam̐ dom̐gi sakkanimomuna nemi sanna seseve (||||) pŏdigi tappaga sūsi bŏmmala jaṁkisugŏṁṭā kadi mĕṁtavŏraseve kāṁtunini madamuna nuppŏṁgi machchigala vĕragaṁdi pŏdalum̐ jannula nĕṁta pūm̐si madimeve (||||) biguvum̐ gām̐giḍam̐ gūḍi pippigām̐ bĕnam̐gugŏṁṭā vĕgaḍuneduraḍĕ śhrī veṁkaḍeśhuni agabaḍi sŏkkiṁchi alamelumaṁgavu nīvu sigurumovidenĕ siṁdiṁcheve