Title (Indic)ఆతఁడు నీ రతులకు నాస సేయఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీ రతులకు నాస సేయఁగా చేతులారా సేవ సేసి చిమ్మి రేఁచ వలదా (॥ఆతఁ॥) సెలవి నేమినవ్వేవే సిగ్గులేల పంచేవే చెలిమిసేసి విభుఁడు చెక్కునొక్కఁగా తలవంచుకొననేలే తమకమేల దాఁచేవే కలికితనాల మతి కరఁగించవలదా (॥ఆతఁ॥) తొరలకేల లోఁగేవే తొంగి తొంగేమి చూచేవే తెరయెత్తి యాతెండు నీదిక్కు చూడఁగా సరియేమి వెనఁగేవే చన్నులేల మూసేవే సరసముల నతని సాదించవలదా (॥ఆతఁ॥) మొక్కు లేల మొక్కేవే ముసుఁగేల వెట్టేవే వొక్కటై శ్రీవేంకటేశుఁ డొడివట్టఁగా గక్కన నెంత మెచ్చేవే కాఁగిట నెంత మించేవే ఇక్కువలంటి నీగోర నెచ్చరించవలదా English(||pallavi||) ādam̐ḍu nī radulagu nāsa seyam̐gā sedulārā seva sesi simmi rem̐sa valadā (||ādam̐||) sĕlavi neminavveve siggulela paṁcheve sĕlimisesi vibhum̐ḍu sĕkkunŏkkam̐gā talavaṁchugŏnanele tamagamela dām̐seve kaligidanāla madi karam̐giṁchavaladā (||ādam̐||) tŏralagela lom̐geve tŏṁgi tŏṁgemi sūseve tĕrayĕtti yādĕṁḍu nīdikku sūḍam̐gā sariyemi vĕnam̐geve sannulela mūseve sarasamula nadani sādiṁchavaladā (||ādam̐||) mŏkku lela mŏkkeve musum̐gela vĕṭṭeve vŏkkaḍai śhrīveṁkaḍeśhum̐ ḍŏḍivaṭṭam̐gā gakkana nĕṁta mĕchcheve kām̐giḍa nĕṁta miṁcheve ikkuvalaṁṭi nīgora nĕchchariṁchavaladā