Title (Indic)ఆతఁడు మగఁడు నీకు నతివవు నీ వైతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు మగఁడు నీకు నతివవు నీ వైతి చేతికి లోనై వుండితేఁ జిత్తము వచ్చుఁ గాక (॥॥) సరసము లాడితేనే చవులు వొడముఁ గాక విరసము లాడితేను వెగటు గాదా మరిగి పొందుసేసితే మనసు గరఁగుఁ గాక వెరవు లే కలిగితే వెక్కసమై యుండదా (॥॥) ననుపులు చూపితేనే నగవులు వచ్చుఁగాక పెనపులఁ జట్టి తేను ప్రియము లవునా మనవులు చెప్పితేనే మచ్చికలు రేఁగుఁ గాక అనువుకు మాటాడితే నందము లవునా (॥॥) సంతములై కూడితేనే సమ్మతౌఁగాక మన పంతము లాడితేను పను లింపౌనా యింతలో శ్రీ వేంకటేశుఁ డెనసె నన్నుఁదానే సంతోసా లిటువంటివి సంగతులే కావా English(||pallavi||) ādam̐ḍu magam̐ḍu nīgu nadivavu nī vaidi sedigi lonai vuṁḍidem̐ jittamu vachchum̐ gāga (||||) sarasamu lāḍidene savulu vŏḍamum̐ gāga virasamu lāḍidenu vĕgaḍu gādā marigi pŏṁduseside manasu garam̐gum̐ gāga vĕravu le kaligide vĕkkasamai yuṁḍadā (||||) nanubulu sūbidene nagavulu vachchum̐gāga pĕnabulam̐ jaṭṭi tenu priyamu lavunā manavulu sĕppidene machchigalu rem̐gum̐ gāga anuvugu māḍāḍide naṁdamu lavunā (||||) saṁtamulai kūḍidene sammadaum̐gāga mana paṁtamu lāḍidenu panu liṁpaunā yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕ nannum̐dāne saṁtosā liḍuvaṁṭivi saṁgadule kāvā