Title (Indic)ఆతఁడు జాణ గాఁబట్టి ఆట్టేలోనికిఁ దీసి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు జాణ గాఁబట్టి ఆట్టేలోనికిఁ దీసి యేతులెల్లాఁ జెల్లఁబెట్టె నేమి సేసేవే (॥ఆతఁడు॥) చనవున నాయకుఁడు సరిఁ జన్నులంటితేను పెనఁగి తిట్టుదురటే ప్రియురాలవు గునియఁగానిందరిలో గురుతులు మోఁచితేను యెనలేదప్పుడు సిగ్గు యేమి సేసేవే (॥ఆతఁడు॥) కూరిమితో రమణుఁడు కొప్పువట్టి తగిలితే గోరున గీఁటుదువటే గుణనిధివి ఆరసి చూచితే పయ్యదకొంగు జారితేను యేరీతినుండునో సిగ్గుయేమి సేసేవే (॥ఆతఁడు॥) శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడితేను కావించి మీరుదురటే కలదానవు మోవిగంటి సేసితివి ముద్రలు నిన్నంటెనిట్టే యీవేళ సిగ్గులకు నీవేమి సేసేవే English(||pallavi||) ādam̐ḍu jāṇa gām̐baṭṭi āṭṭelonigim̐ dīsi yedulĕllām̐ jĕllam̐bĕṭṭĕ nemi seseve (||ādam̐ḍu||) sanavuna nāyagum̐ḍu sarim̐ jannulaṁṭidenu pĕnam̐gi tiṭṭuduraḍe priyurālavu guniyam̐gāniṁdarilo gurudulu mom̐sidenu yĕnaledappuḍu siggu yemi seseve (||ādam̐ḍu||) kūrimido ramaṇum̐ḍu kŏppuvaṭṭi tagilide goruna gīm̐ṭuduvaḍe guṇanidhivi ārasi sūside payyadagŏṁgu jāridenu yerīdinuṁḍuno sigguyemi seseve (||ādam̐ḍu||) śhrīveṁkaḍeśhvarum̐ḍu seri ninnum̐ gūḍidenu kāviṁchi mīruduraḍe kaladānavu movigaṁṭi sesidivi mudralu ninnaṁṭĕniṭṭe yīveḽa siggulagu nīvemi seseve