Title (Indic)ఆతఁడు గలితేఁ జాలు అన్ని పనులను మేలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు గలితేఁ జాలు అన్ని పనులను మేలే యీతల నిన్ను జరయనేఁటికమ్మా మాకు (॥అతఁ॥) చలముగలవారిని సమ్మతించఁ జేయరాదు సలిగెగలవారిని సాదించరాదు కలిమిగలవారిని కాదుగూడదనరాదు యెలమి నీతోడివాదు లేఁటికమ్మా మాకు (॥ఆతఁ॥) నాలితో నుండేవారి నవ్వించఁజేయరాదు గేలిసేసేవారిని గెంటించరాదు మేలమాడేవారిని మేరలు మీఱఁగరాదు యీలీల నిన్ను జంకించనేఁటికమ్మా మాకు (॥ఆతఁ॥) మౌనాననుండేవారిని మాటలాడించఁగరాదు నానాగుణమువారి నమ్మించరాదు పూని శ్రీవేంకటేశుఁడు పొసఁగ నన్నే లె నిదె యేనెపాలు వేయ నీతోనేఁటికమ్మా మాకు English(||pallavi||) ādam̐ḍu galidem̐ jālu anni panulanu mele yīdala ninnu jarayanem̐ṭigammā māgu (||adam̐||) salamugalavārini sammadiṁcham̐ jeyarādu saligĕgalavārini sādiṁcharādu kalimigalavārini kādugūḍadanarādu yĕlami nīdoḍivādu lem̐ṭigammā māgu (||ādam̐||) nālido nuṁḍevāri navviṁcham̐jeyarādu gelisesevārini gĕṁṭiṁcharādu melamāḍevārini meralu mīṟam̐garādu yīlīla ninnu jaṁkiṁchanem̐ṭigammā māgu (||ādam̐||) maunānanuṁḍevārini māḍalāḍiṁcham̐garādu nānāguṇamuvāri nammiṁcharādu pūni śhrīveṁkaḍeśhum̐ḍu pŏsam̐ga nanne lĕ nidĕ yenĕbālu veya nīdonem̐ṭigammā māgu