Title (Indic)ఆతఁడు భక్తసులభుఁ డచ్యుతుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు భక్తసులభుఁ డచ్యుతుఁడు రాతిగుండెవాఁడుగాఁడు రంతు మానుఁ డిఁకను (॥ఆతఁ॥) జీవుఁడా వేసరకు చిత్తమా జడియకు దైవము గరుణించఁ దడవు గాదు తోవ చూపె మనకు తొల్లే ఆచార్యుఁడు కావలసినట్లయ్యీఁ గలఁగకుఁ డిఁకను (॥ఆతఁ॥) కాలమా వేగిరంచకు కర్మమా నన్నుమీరకు పాలించ దైవానకు నే భార మిఁకను ఆలించి తిరుమంత్రమే ఆతని నన్నుఁ గూరిచె వేళగాని అందాఁకా వేసరకుఁ డిఁకను (॥ఆతఁ॥) వెఱవకు దేహమా వేసరకు ధ్యానమా యెఱిఁగి శ్రీవేంకటేశుఁ డెడసిపోఁడు తఱి నిహపరము లితనిదాసు లిచ్చిరి గుఱియైతి నిన్నిటికిఁ గొంకకుఁడీ ఇఁకను English(||pallavi||) ādam̐ḍu bhaktasulabhum̐ ḍachyudum̐ḍu rādiguṁḍĕvām̐ḍugām̐ḍu raṁtu mānum̐ ḍim̐kanu (||ādam̐||) jīvum̐ḍā vesaragu sittamā jaḍiyagu daivamu garuṇiṁcham̐ daḍavu gādu tova sūbĕ managu tŏlle āsāryum̐ḍu kāvalasinaṭlayyīm̐ galam̐gagum̐ ḍim̐kanu (||ādam̐||) kālamā vegiraṁchagu karmamā nannumīragu pāliṁcha daivānagu ne bhāra mim̐kanu āliṁchi tirumaṁtrame ādani nannum̐ gūrisĕ veḽagāni aṁdām̐kā vesaragum̐ ḍim̐kanu (||ādam̐||) vĕṟavagu dehamā vesaragu dhyānamā yĕṟim̐gi śhrīveṁkaḍeśhum̐ ḍĕḍasibom̐ḍu taṟi nihabaramu lidanidāsu lichchiri guṟiyaidi ninniḍigim̐ gŏṁkagum̐ḍī im̐kanu