Title (Indic)ఆతఁడూ నే నొక్కటే యరసి చూడఁగనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడూ నే నొక్కటే యరసి చూడఁగనేల కాంతరించి చెలులాల కడవ నాడకురే (॥ఆతఁ॥) మిక్కిలి నాతఁడు నాకు మేలువాఁడై వున్నవాఁడు యిక్కువ బాసలు నా కిచ్చినవాఁడు మక్కువ తోడుత నా మాఁటకు లోనైనవాఁడు ఇక్కడ నా మగనితో నేల కొసరేవే (॥ఆతఁ॥) పరగ నా కాఁగిటికి బతిమి వట్టుకున్నాఁడు మరుతంత్రముల నన్ను మరిగినాఁడు ఇరవై యేపొద్దూ నా యింటిలోనే వున్నవాఁడు యెరవుగా నిపుడు మీ రెంత సొలసేరే (॥ఆతఁ॥) అందరిలోనా నాకే ఆసపడి వున్నవాఁడు కందువ నా మోవి పొత్తు గలసినాఁడు అందపు శ్రీవేంకటేశఁ డన్నిటా నన్నేలినాఁడు సందడించి మీ రేమి సాదించవచ్చేరే English(||pallavi||) ādam̐ḍū ne nŏkkaḍe yarasi sūḍam̐ganela kāṁtariṁchi sĕlulāla kaḍava nāḍagure (||ādam̐||) mikkili nādam̐ḍu nāgu meluvām̐ḍai vunnavām̐ḍu yikkuva bāsalu nā kichchinavām̐ḍu makkuva toḍuda nā mām̐ṭagu lonainavām̐ḍu ikkaḍa nā maganido nela kŏsareve (||ādam̐||) paraga nā kām̐giḍigi badimi vaṭṭugunnām̐ḍu marudaṁtramula nannu mariginām̐ḍu iravai yebŏddū nā yiṁṭilone vunnavām̐ḍu yĕravugā nibuḍu mī rĕṁta sŏlasere (||ādam̐||) aṁdarilonā nāge āsabaḍi vunnavām̐ḍu kaṁduva nā movi pŏttu galasinām̐ḍu aṁdabu śhrīveṁkaḍeśham̐ ḍanniḍā nannelinām̐ḍu saṁdaḍiṁchi mī remi sādiṁchavachchere