Title (Indic)ఆతఁడిదె నీవిదె అరగొరతేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడిదె నీవిదె అరగొరతేఁటికే కాతరానఁ గాఁగిలించి కపటము లేఁటికే (॥ఆతఁ॥) యిచ్చకము లాడేది హితము మోహములకు పచ్చిదేర నవ్వేది ఫల మందుకు ముచ్చటలు నడుపేది మొదలు కూటములకు యెచ్చుకుందుసొలపులు యీడ మరియేఁటికే (॥ఆతఁ॥) తమకించి పైకొనుటే తగవు వయసులకు అమరఁగఁ బెనఁగేదే ఆయ మందుకు సమమగు సరసాలే చవులు కరఁగులకు తిమిరేటి పంతముల తెరమఱఁగేఁటికి (॥ఆతఁ॥) ఇటువలెఁ గూడేదే యెన్నిక ఆసలకును ఘటన మోవితేనెలే కందు వందుకు తటుకనఁగూడె శ్రీవేంకటరమణుఁడు నిన్ను నటనలన్నియుఁగూడె నాలి ఇఁకనేఁటికే English(||pallavi||) ādam̐ḍidĕ nīvidĕ aragŏradem̐ṭige kādarānam̐ gām̐giliṁchi kabaḍamu lem̐ṭige (||ādam̐||) yichchagamu lāḍedi hidamu mohamulagu pachchidera navvedi phala maṁdugu muchchaḍalu naḍubedi mŏdalu kūḍamulagu yĕchchuguṁdusŏlabulu yīḍa mariyem̐ṭige (||ādam̐||) tamagiṁchi paigŏnuḍe tagavu vayasulagu amaram̐gam̐ bĕnam̐gede āya maṁdugu samamagu sarasāle savulu karam̐gulagu timireḍi paṁtamula tĕramaṟam̐gem̐ṭigi (||ādam̐||) iḍuvalĕm̐ gūḍede yĕnniga āsalagunu ghaḍana movidenĕle kaṁdu vaṁdugu taḍuganam̐gūḍĕ śhrīveṁkaḍaramaṇum̐ḍu ninnu naḍanalanniyum̐gūḍĕ nāli im̐kanem̐ṭige