Title (Indic)ఆతఁడిదె నీవిదె అన్నిటాను జాణలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడిదె నీవిదె అన్నిటాను జాణలు యేతుల నింకానేలే యెడమాఁటలు (॥ఆత॥) అంకెకు రానేరిచితే అలుకలైనా సుఖమే మంకుఁదనాలుడిగినమానినులకు సంకెదీరితే మరునిశరములెల్లా విరులే యింకనైనా మామాఁట లియ్యకొనరే (॥ఆత॥) విననేరిచినఁజాలు విరహమైన సుఖమే మనసుదెలిసినట్టి మగువలకు చెనకి లాలించితేను చిలుకలు మాఁటలాడు చలములు మాని యిఁక సమ్మతించరే (॥ఆత॥) సరసము నేరిచితే జంకెనలైనా సుఖమే తరితీపులెఁరిగిన తరుణులకు యిరవై శ్రీవేంకటేశుఁడిదివో నిన్నిటు గూడె యెరవులు మరియేల యెనశుండరే English(||pallavi||) ādam̐ḍidĕ nīvidĕ anniḍānu jāṇalu yedula niṁkānele yĕḍamām̐ṭalu (||āda||) aṁkĕgu rāneriside alugalainā sukhame maṁkum̐danāluḍiginamāninulagu saṁkĕdīride maruniśharamulĕllā virule yiṁkanainā māmām̐ṭa liyyagŏnare (||āda||) vinanerisinam̐jālu virahamaina sukhame manasudĕlisinaṭṭi maguvalagu sĕnagi lāliṁchidenu silugalu mām̐ṭalāḍu salamulu māni yim̐ka sammadiṁchare (||āda||) sarasamu neriside jaṁkĕnalainā sukhame taridībulĕm̐rigina taruṇulagu yiravai śhrīveṁkaḍeśhum̐ḍidivo ninniḍu gūḍĕ yĕravulu mariyela yĕnaśhuṁḍare