Title (Indic)ఆతఁడిదె నీవిదె ఆసలెల్లా నెరవేరె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడిదె నీవిదె ఆసలెల్లా నెరవేరె చేతికి లోనాయఁ బతి చెల్లునమ్మా (॥ఆత॥) మగఁడు నిన్ను మన్నించె మనసొక్కటాయనిఁక నగవద్దా యిఁకనీవు నలినాక్షి మగువలమున్నారము మంకుమీయలుకదీర్చ జిగినీవు చేసినదే చేఁత యిఁకనమ్మా (॥ఆత॥) రమణుఁడు చెయి వట్టె రాజసము నీకుఁ దగు చెమరించ నీకువద్దా చిగురుఁబోఁడి అమరించఁగలము నీయంకెకు నన్నిపనులు విమలము నీపగటు విచ్చనవిడెమ్మా (॥ఆత॥) శ్రీవేంకటేశుఁడు గూడె చెలివలమేల్మంగవు నీ వాతని మెచ్చవద్దా నీలవేణి చేపదేరె మాకొలువు సేవలిట్టే సేసేము కైవసమాయ రతులు కళదేరవమ్మా English(||pallavi||) ādam̐ḍidĕ nīvidĕ āsalĕllā nĕraverĕ sedigi lonāyam̐ badi sĕllunammā (||āda||) magam̐ḍu ninnu manniṁchĕ manasŏkkaḍāyanim̐ka nagavaddā yim̐kanīvu nalinākṣhi maguvalamunnāramu maṁkumīyalugadīrsa jiginīvu sesinade sem̐ta yim̐kanammā (||āda||) ramaṇum̐ḍu sĕyi vaṭṭĕ rājasamu nīgum̐ dagu sĕmariṁcha nīguvaddā sigurum̐bom̐ḍi amariṁcham̐galamu nīyaṁkĕgu nannibanulu vimalamu nībagaḍu vichchanaviḍĕmmā (||āda||) śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ sĕlivalamelmaṁgavu nī vādani mĕchchavaddā nīlaveṇi sebaderĕ māgŏluvu sevaliṭṭe sesemu kaivasamāya radulu kaḽaderavammā