Title (Indic)ఆతఁడిచ్చిన చనవే అన్నిటా నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడిచ్చిన చనవే అన్నిటా నీకు గాతసేయ కింతట మొక్కఁగరాదా నీవు (॥ఆత॥) సన్నచేసి రమణుఁడు సలిగె నీకిచ్చెనంటా యెన్నిమాటలాడేవే యేమే నీవు ఉన్నతినెందుకైనాను వోరిచీనాతఁడంటా మిన్నక నేఁడెంత మేరమీరేవే నీవు (॥ఆత॥) దొరతనమిచ్చి నీపొందులకు లోనాయనంటా కెరలి యేమిటికి జంకించేవే నీవు సిరుల నీచేఁతలెల్లాఁ జెల్లిఁచీనంటాను వొరసి గోరనేల వూఁదేవు నీవు (॥ఆత॥) కదిసి యాతఁడు మెచ్చి కాఁగలించుకొనెనంటా వుదుటుఁ జన్నులనేల వొత్తేవే నీవు వెదకి యిటువంటి శ్రీ వేంకటేశుఁడేలెనంటా ముదమున రతినెంత ముంచేవే నీవు English(||pallavi||) ādam̐ḍichchina sanave anniḍā nīgu gādaseya kiṁtaḍa mŏkkam̐garādā nīvu (||āda||) sannasesi ramaṇum̐ḍu saligĕ nīgichchĕnaṁṭā yĕnnimāḍalāḍeve yeme nīvu unnadinĕṁdugainānu vorisīnādam̐ḍaṁṭā minnaga nem̐ḍĕṁta meramīreve nīvu (||āda||) dŏradanamichchi nībŏṁdulagu lonāyanaṁṭā kĕrali yemiḍigi jaṁkiṁcheve nīvu sirula nīsem̐talĕllām̐ jĕllim̐sīnaṁṭānu vŏrasi goranela vūm̐devu nīvu (||āda||) kadisi yādam̐ḍu mĕchchi kām̐galiṁchugŏnĕnaṁṭā vuduḍum̐ jannulanela vŏtteve nīvu vĕdagi yiḍuvaṁṭi śhrī veṁkaḍeśhum̐ḍelĕnaṁṭā mudamuna radinĕṁta muṁcheve nīvu