Title (Indic)ఆతఁడెంత నీ వెంత అదేమే నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడెంత నీ వెంత అదేమే నీవు యేతరితనము లింత ఇతవా నీకు (॥ఆతఁ॥) మొగము చూచి చూచి మొలకనవ్వు నవ్వేవు యెగసక్కే లకుఁ బతి నిదేమే నీవు చిగురుమోవిమోటలఁ జిమ్మిరేఁగ సొలసేవు వెగటుజాణతనాల వేడుకా నీకు (॥ఆతఁ॥) కులుకుగుబ్బ లదరఁ గొసరి సన్నసేసేవు యెలఇంచే వితని నితేమే నీవు చిలుకు గోరికొనలఁ జెనకి వేఁడుకొనేవు వెలలేని సరసాలు వేడుకానీకు (॥ఆతఁ॥) గుట్టుతో వద్దఁ గూచుండి కొప్పు గడుదువ్వేవు యిట్టె శ్రీవేంకటేశు నీదేమే నీవు నెట్టన నన్నితఁడేలె నే నలమేలుమంగను వెట్టికిఁ గూడె వతని వేడుకా నీకు English(||pallavi||) ādam̐ḍĕṁta nī vĕṁta ademe nīvu yedaridanamu liṁta idavā nīgu (||ādam̐||) mŏgamu sūsi sūsi mŏlaganavvu navvevu yĕgasakke lagum̐ badi nideme nīvu sigurumovimoḍalam̐ jimmirem̐ga sŏlasevu vĕgaḍujāṇadanāla veḍugā nīgu (||ādam̐||) kulugugubba ladaram̐ gŏsari sannasesevu yĕla̮iṁche vidani nideme nīvu silugu gorigŏnalam̐ jĕnagi vem̐ḍugŏnevu vĕlaleni sarasālu veḍugānīgu (||ādam̐||) guṭṭudo vaddam̐ gūsuṁḍi kŏppu gaḍuduvvevu yiṭṭĕ śhrīveṁkaḍeśhu nīdeme nīvu nĕṭṭana nannidam̐ḍelĕ ne nalamelumaṁganu vĕṭṭigim̐ gūḍĕ vadani veḍugā nīgu