Title (Indic)ఆతఁడేమి సేసినాను అదె సమ్మతి నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడేమి సేసినాను అదె సమ్మతి నాకు చేతికి లోనై నేను చిత్తములోదానను (॥ఆతఁ॥) యేఁటికో చెలులతోడ నేకతమాడీ నతఁడు మాటలాడకురే మీరు మగువలాల వాఁటమై యెవ్వరైన వత్తురు సేతు రాడకు బూటకాలు సేయ నిఁకఁ బోకు రే మీరు (॥ఆతఁ॥) ఇప్పుడె అవ్వలిమోమై యెవ్వరిఁ జూచీనో తాను తప్పక చూడకురే వోతరుణులాల చెప్పి యెరిఁగించుకొంటే సిగ్గువడుఁ జేసుఁ బతి ముప్పిరి మావారమని మొక్కకురే మీరు (॥ఆతఁ॥) ఇమ్ముల నిలుచున్నాఁడు యీడకే వచ్చీనోయేమో రమ్మని పిలువకురే రమణులాల నెమ్మి శ్రీవేంకటేశుఁడు నే నలమేలుమంగను నమ్మించి నన్నుఁ గూడెను నవ్వకరే మీరు English(||pallavi||) ādam̐ḍemi sesinānu adĕ sammadi nāgu sedigi lonai nenu sittamulodānanu (||ādam̐||) yem̐ṭigo sĕluladoḍa negadamāḍī nadam̐ḍu māḍalāḍagure mīru maguvalāla vām̐ṭamai yĕvvaraina vatturu sedu rāḍagu būḍagālu seya nim̐kam̐ bogu re mīru (||ādam̐||) ippuḍĕ avvalimomai yĕvvarim̐ jūsīno tānu tappaga sūḍagure vodaruṇulāla sĕppi yĕrim̐giṁchugŏṁṭe sigguvaḍum̐ jesum̐ badi muppiri māvāramani mŏkkagure mīru (||ādam̐||) immula nilusunnām̐ḍu yīḍage vachchīnoyemo rammani piluvagure ramaṇulāla nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍu ne nalamelumaṁganu nammiṁchi nannum̐ gūḍĕnu navvagare mīru