Title (Indic)ఆతఁడేమనునో యని అనుమానించఁగనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడేమనునో యని అనుమానించఁగనేల చేతికిఁ గానుకియ్యవే చెప్పీఁ దానె సుద్దులు (॥ఆత॥) వలవనేర్చినవాఁడు వట్టిజాలిఁ బెట్టఁడు పలుకనేర్చినవాఁడు బాసదప్పఁడు కలయనేర్చినవాఁడు గర్వములు చూపఁడు పిలువవే యతని నాప్రేమ తానె యెరుఁగును (॥ఆత॥) మనసెరిఁగినవాఁడు మరి జవదాఁటఁడు తనవాఁడైనవాఁడు వింతలు సేయఁడు ననుపు గలుగువాఁడు నవ్వినానెగ్గుపట్టఁడు వినయానఁ దోడితేవే విభుఁడన్నీ నెరుఁగు (॥ఆత॥) ఆసలుగలవాఁడు అట్టె జోలిసేయఁడు వాసిగలవాఁడు తనవారిఁ బాయఁడు సేసవెట్టెఁ దానె వచ్చి శ్రీ వేంకటేశుఁడు గూడె రాసికెక్కె దినమును రప్పించవే ఆతని English(||pallavi||) ādam̐ḍemanuno yani anumāniṁcham̐ganela sedigim̐ gānugiyyave sĕppīm̐ dānĕ suddulu (||āda||) valavanersinavām̐ḍu vaṭṭijālim̐ bĕṭṭam̐ḍu paluganersinavām̐ḍu bāsadappam̐ḍu kalayanersinavām̐ḍu garvamulu sūbam̐ḍu piluvave yadani nāprema tānĕ yĕrum̐gunu (||āda||) manasĕrim̐ginavām̐ḍu mari javadām̐ṭam̐ḍu tanavām̐ḍainavām̐ḍu viṁtalu seyam̐ḍu nanubu galuguvām̐ḍu navvinānĕggubaṭṭam̐ḍu vinayānam̐ doḍideve vibhum̐ḍannī nĕrum̐gu (||āda||) āsalugalavām̐ḍu aṭṭĕ joliseyam̐ḍu vāsigalavām̐ḍu tanavārim̐ bāyam̐ḍu sesavĕṭṭĕm̐ dānĕ vachchi śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ rāsigĕkkĕ dinamunu rappiṁchave ādani