Title (Indic)ఆతఁడే యిన్నియు నిచ్చు నడిగినవల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే యిన్నియు నిచ్చు నడిగినవల్లాను చేతిలోనే వుండఁగాను చింతించరు హరిని (॥ఆతఁ॥) వలెనంటే సంపదలు వట్టి యలమటఁబెట్టు అలసి వోపనంటేను అండనే వుండు తలఁచి యిందరు నీతరితీపులఁ జిక్కి తలఁచ రెందును బరతత్త్వమైన హరిని (॥ఆతఁ॥) ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి పోసరించి యిందరు నీ పొందుల భ్రమలఁ బడి పాసి వున్నారదే తమ పతియైన హరిని (॥ఆతఁ॥) గట్టిగా రాతిరెల్లాను కలయైయుండు జగము పట్టపగలైతే తమ పాల నుండును బట్టబయలు పందిలి పెట్టేరుగాని చే- పట్టరు శ్రీవేంకటాద్రిపైనున్న హరిని English(||pallavi||) ādam̐ḍe yinniyu nichchu naḍiginavallānu sedilone vuṁḍam̐gānu siṁtiṁcharu harini (||ādam̐||) valĕnaṁṭe saṁpadalu vaṭṭi yalamaḍam̐bĕṭṭu alasi vobanaṁṭenu aṁḍane vuṁḍu talam̐si yiṁdaru nīdaridībulam̐ jikki talam̐sa rĕṁdunu baradattvamaina harini (||ādam̐||) āsabaḍide niṁtulu anniḍānu biguduru vāsido nuṁṭene tāme vattu rŏddigi posariṁchi yiṁdaru nī pŏṁdula bhramalam̐ baḍi pāsi vunnārade tama padiyaina harini (||ādam̐||) gaṭṭigā rādirĕllānu kalayaiyuṁḍu jagamu paṭṭabagalaide tama pāla nuṁḍunu baṭṭabayalu paṁdili pĕṭṭerugāni se- paṭṭaru śhrīveṁkaḍādribainunna harini