Title (Indic)ఆతఁడే యెరుఁగును అంకెలైన తగులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే యెరుఁగును అంకెలైన తగులు చేతిలోనే వున్నదిది చెప్పరాని తగులు (॥ఆత॥) మలసి చూచిన చూపు మనసులో తగులు తలఁపు లోపలి చింత తనువుకుఁ దగులు వెలయుమేని సోఁకులు వేడుకకుఁ దగులు అలరు వేడుకలే అన్నిటికిఁ దగులు (॥ఆత॥) చిమ్ముచు నవ్విన నవ్వు సిగ్గులకుఁ దగులు కుమ్మరించు సిగ్గులే తక్కుల తగులు వుమ్మడి తక్కులెల్లా వొక్కటికిఁ దగులు యిమ్ముల నొక్కటైతేనే యిరవాయఁ దగులు (॥ఆత॥) మచ్చిక మాటలన్నియు మంతనాల తగులు నిచ్చలు మంతనములు నిండురతి తగులు చెచ్చెర నీ తగులు నా శ్రీ వేంకటేశుఁ గూడె పచ్చి దోఁచిన కూటమి పంతముల తగులు English(||pallavi||) ādam̐ḍe yĕrum̐gunu aṁkĕlaina tagulu sedilone vunnadidi sĕpparāni tagulu (||āda||) malasi sūsina sūbu manasulo tagulu talam̐pu lobali siṁta tanuvugum̐ dagulu vĕlayumeni som̐kulu veḍugagum̐ dagulu alaru veḍugale anniḍigim̐ dagulu (||āda||) simmusu navvina navvu siggulagum̐ dagulu kummariṁchu siggule takkula tagulu vummaḍi takkulĕllā vŏkkaḍigim̐ dagulu yimmula nŏkkaḍaidene yiravāyam̐ dagulu (||āda||) machchiga māḍalanniyu maṁtanāla tagulu nichchalu maṁtanamulu niṁḍuradi tagulu sĕchchĕra nī tagulu nā śhrī veṁkaḍeśhum̐ gūḍĕ pachchi dom̐sina kūḍami paṁtamula tagulu