Title (Indic)ఆతఁడే యీడకు వచ్చీ నన్నిటికిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే యీడకు వచ్చీ నన్నిటికిని యీతల మాపు దాఁకా నీ కేమి చెప్పే మిఁకనూ (॥ఆతఁ॥) పవ్వళించీ నాయకుఁడు పైపైనీ కెదురుచూచి యివ్వల సింగారించే వింకా నీవు యెవ్వ రెంతగాఁ జెప్పిరొ యేమని తలపోసేవు రవ్వగా వచ్చేయట్టైతే రావా నీ వప్పుడే (॥ఆతఁ॥) సరి నీ కెదురుచూచి జాగరా లున్నాఁ డతఁడు యిరవై అద్దము చూచే వింకా నీవు సరసానకో నీవు చలమెంత పట్టితివొ యెరవు లేకున్నఁ జన వియ్యవా నీ వింతకా (॥ఆతఁ॥) వేగిరాన నేతెంచి శ్రీవేంకటేశుఁ డీడఁ గూడె యీగతి సిగ్గులువడే వింకా నీవు బాగుగా నీతనింటికి బడినే నీవు వచ్చితి నీగుణాలకుఁ దగ్గట్టు నేరవా నీ విఁకనూ English(||pallavi||) ādam̐ḍe yīḍagu vachchī nanniḍigini yīdala mābu dām̐kā nī kemi sĕppe mim̐kanū (||ādam̐||) pavvaḽiṁchī nāyagum̐ḍu paibainī kĕdurusūsi yivvala siṁgāriṁche viṁkā nīvu yĕvva rĕṁtagām̐ jĕppirŏ yemani talabosevu ravvagā vachcheyaṭṭaide rāvā nī vappuḍe (||ādam̐||) sari nī kĕdurusūsi jāgarā lunnām̐ ḍadam̐ḍu yiravai addamu sūse viṁkā nīvu sarasānago nīvu salamĕṁta paṭṭidivŏ yĕravu legunnam̐ jana viyyavā nī viṁtagā (||ādam̐||) vegirāna nedĕṁchi śhrīveṁkaḍeśhum̐ ḍīḍam̐ gūḍĕ yīgadi sigguluvaḍe viṁkā nīvu bāgugā nīdaniṁṭigi baḍine nīvu vachchidi nīguṇālagum̐ daggaṭṭu neravā nī vim̐kanū