Title (Indic)ఆతఁడే యెఱుఁగును అన్నిపనులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే యెఱుఁగును అన్నిపనులు నీతి యెంచితే తన నెలఁత నే ననవే (॥॥) మలసి యాడఁ జొచ్చితే మాట లెన్నైనాఁ గలవు తలఁచితే నెన్ని లేవు తలపోఁతలు నెలకొన్న దెఱఁగవా నీరు కొలఁది తామర చెలియరో నే నేమని చెప్పేనే నీకూ (॥॥) మునుకొని నవ్వితేను మొగమెల్లా నవ్వు కనుఁగొంటే నిండుకొనుఁ గనుచూపులు పెనఁగ నేఁటికే నీవు పిండెంతే నిప్పటి దినదినము నెంతని తెలిపేనే నీకు (॥॥) కడు నెంత వెరిగినా కౌఁగిటిలోనే చన్నులు బడి వాయకుండి తేను పాయదు తమి అడరి శ్రీ వేంకటేశుఁడంతలోనే నన్నేలె యీ యెడఁ బైఁడెంతే తూని కేమనెనే నీకూ English(||pallavi||) ādam̐ḍe yĕṟum̐gunu annibanulu nīdi yĕṁchide tana nĕlam̐ta ne nanave (||||) malasi yāḍam̐ jŏchchide māḍa lĕnnainām̐ galavu talam̐side nĕnni levu talabom̐talu nĕlagŏnna dĕṟam̐gavā nīru kŏlam̐di tāmara sĕliyaro ne nemani sĕppene nīgū (||||) munugŏni navvidenu mŏgamĕllā navvu kanum̐gŏṁṭe niṁḍugŏnum̐ ganusūbulu pĕnam̐ga nem̐ṭige nīvu piṁḍĕṁte nippaḍi dinadinamu nĕṁtani tĕlibene nīgu (||||) kaḍu nĕṁta vĕriginā kaum̐giḍilone sannulu baḍi vāyaguṁḍi tenu pāyadu tami aḍari śhrī veṁkaḍeśhum̐ḍaṁtalone nannelĕ yī yĕḍam̐ baim̐ḍĕṁte tūni kemanĕne nīgū