Title (Indic)ఆతఁడే యెఱఁగఁడా అతివ నీ లాగులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే యెఱఁగఁడా అతివ నీ లాగులు యీతల నీ మచ్చిక లింకా నెంత చెప్పేవే (॥ఆతఁ॥) మనసులో తమకము మాఁటలనే కానవచ్చె కనుచూపులనె యింపు గనుపట్టెను వినయములనే బత్తి వెల్లవిరియై మించె యెనసే నీ చుట్టరిక మింకా నెంత చెప్పేవే (॥ఆతఁ॥) చెప్పరాని మోహములు చిరునవ్వులఁ దెలిసె ముప్పిరిఁ గళలు మోమున వెలసె కుప్పలైన పులకల కోరికలు దేటపడె యిప్పుడు నీ యనురాగ మేమి చెప్పేవే (॥ఆతఁ॥) సరసపు చెనకులు చనుగుబ్బ లెఱిఁగించె మరిగిన మమత మర్మముల నిండె యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్ను నేలె యెరవుగా నీవలపు యిఁక నేమి చేప్పేవే English(||pallavi||) ādam̐ḍe yĕṟam̐gam̐ḍā adiva nī lāgulu yīdala nī machchiga liṁkā nĕṁta sĕppeve (||ādam̐||) manasulo tamagamu mām̐ṭalane kānavachchĕ kanusūbulanĕ yiṁpu ganubaṭṭĕnu vinayamulane batti vĕllaviriyai miṁchĕ yĕnase nī suṭṭariga miṁkā nĕṁta sĕppeve (||ādam̐||) sĕpparāni mohamulu sirunavvulam̐ dĕlisĕ muppirim̐ gaḽalu momuna vĕlasĕ kuppalaina pulagala korigalu deḍabaḍĕ yippuḍu nī yanurāga memi sĕppeve (||ādam̐||) sarasabu sĕnagulu sanugubba lĕṟim̐giṁchĕ marigina mamada marmamula niṁḍĕ yiravai śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnu nelĕ yĕravugā nīvalabu yim̐ka nemi seppeve