Title (Indic)ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు ఆతని బంట్లము మాకు నన్నిటా నిశ్చింతము (॥ఆతఁ॥) యేలికెగల బంటుకు యెక్కడిది విచారము పాలించే మగఁడుగల పడఁతి కేడ చింత కోలుముందై తండ్రిగల కొడుకు కేది తొడుసు యీలీల హరిదాసుని కెక్కడికోరికెలు (॥ఆతఁ॥) బలుదుర్గము వానికి భయ మేమిటా లేదు కలిమిగలవానికి కడమ లేదు యిల క్షేత్రవంతునికి నెందూ దరిద్రము లేదు అల శ్రీపతిబంట్లకు నలమట లేదు (॥ఆతఁ॥) పట్టిన ముద్రుంగరపుప్రధాని కెదురు లేదు కుట్టి చాతనికివారికిఁ గొంకు లేదు నెట్టిన శ్రీవేంకటాద్రినిలయు సేవకులము గుట్టుతోడ బ్రదికేము గుఱి మాకు నతఁడే English(||pallavi||) ādam̐ḍe yajamānum̐ḍu ādinārāyaṇum̐ḍu ādani baṁṭlamu māgu nanniḍā niśhchiṁtamu (||ādam̐||) yeligĕgala baṁṭugu yĕkkaḍidi visāramu pāliṁche magam̐ḍugala paḍam̐ti keḍa siṁta kolumuṁdai taṁḍrigala kŏḍugu kedi tŏḍusu yīlīla haridāsuni kĕkkaḍigorigĕlu (||ādam̐||) baludurgamu vānigi bhaya memiḍā ledu kalimigalavānigi kaḍama ledu yila kṣhetravaṁtunigi nĕṁdū daridramu ledu ala śhrībadibaṁṭlagu nalamaḍa ledu (||ādam̐||) paṭṭina mudruṁgarabupradhāni kĕduru ledu kuṭṭi sādanigivārigim̐ gŏṁku ledu nĕṭṭina śhrīveṁkaḍādrinilayu sevagulamu guṭṭudoḍa bradigemu guṟi māgu nadam̐ḍe