Title (Indic)ఆతఁడే విష్ణుం డఖిలము నడపెడి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే విష్ణుం డఖిలము నడపెడి యీతల నెవ్వరి కేఁటికిఁ జింతా (॥ఆతఁ॥) పుట్టించఁ బెంచఁగ పొడవెక్కించ దేహుల గట్టిగా మాఁటలాడించఁ గదలించ పట్టి వాన గురియించ పైరులు మొలపించ తిట్ట పెట్ట నొకానొకదేవుఁడు గలఁడు (॥ఆతఁ॥) అన్నపానము లొఁగ నాపదలు గడపఁగ పన్ని మాయలు భువిఁ బచరించ విన్నపాలు సురలవి విని యందరి రక్షింప వున్నతోన్నతుఁడై వొకానొకకర్త గలఁడు (॥ఆతఁ॥) కాల మక్షయము సేయ కర్మము ఫలించఁజేయ తాళుకొని మరపించఁ దలఁపించ పాలుపడి శ్రీవేంకటపతియై వేదాలుచెప్పే- యేలిక యొకానొక యీశ్వరుఁడు గలఁడు English(||pallavi||) ādam̐ḍe viṣhṇuṁ ḍakhilamu naḍabĕḍi yīdala nĕvvari kem̐ṭigim̐ jiṁtā (||ādam̐||) puṭṭiṁcham̐ bĕṁcham̐ga pŏḍavĕkkiṁcha dehula gaṭṭigā mām̐ṭalāḍiṁcham̐ gadaliṁcha paṭṭi vāna guriyiṁcha pairulu mŏlabiṁcha tiṭṭa pĕṭṭa nŏgānŏgadevum̐ḍu galam̐ḍu (||ādam̐||) annabānamu lŏm̐ga nābadalu gaḍabam̐ga panni māyalu bhuvim̐ basariṁcha vinnabālu suralavi vini yaṁdari rakṣhiṁpa vunnadonnadum̐ḍai vŏgānŏgagarda galam̐ḍu (||ādam̐||) kāla makṣhayamu seya karmamu phaliṁcham̐jeya tāḽugŏni marabiṁcham̐ dalam̐piṁcha pālubaḍi śhrīveṁkaḍabadiyai vedālusĕppe- yeliga yŏgānŏga yīśhvarum̐ḍu galam̐ḍu