Title (Indic)ఆతఁడే పో మా యేలిక ఆతఁడే జగన్మూల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే పో మా యేలిక ఆతఁడే జగన్మూల- మాతఁడే శ్రీవేంకటాద్రియందుమీఁది దైవము (॥ఆతఁడోపో॥) కమలవాసిని యైన కాంతఁ బెండ్లాడినాఁడు కమలములో బిడ్డఁ గన్నవాఁడు కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు కమలనాభుఁడేపో కలుగు మాదైవము (॥ఆతఁడోపో॥) జలధి బంధించి లంక సంహరించినవాఁడు జలధిచొచ్చినదైత్యుఁజంపినవాఁడు జలధిసుతునకు వరుస బావైనవాఁడు జలధి శయనుఁడేపో చక్కని మాదైవము (॥ఆతఁడోపో॥) కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు కొండలకు నెక్కుడైన గురుతు శ్రీవేంకటాద్రి- కొండరూపు దానేపో కోరిన మాదైవము English(||pallavi||) ādam̐ḍe po mā yeliga ādam̐ḍe jaganmūla- mādam̐ḍe śhrīveṁkaḍādriyaṁdumīm̐di daivamu (||ādam̐ḍobo||) kamalavāsini yaina kāṁtam̐ bĕṁḍlāḍinām̐ḍu kamalamulo biḍḍam̐ gannavām̐ḍu kamalāptunilonam̐ galigi mĕrayuvām̐ḍu kamalanābhum̐ḍebo kalugu mādaivamu (||ādam̐ḍobo||) jaladhi baṁdhiṁchi laṁka saṁhariṁchinavām̐ḍu jaladhisŏchchinadaityum̐jaṁpinavām̐ḍu jaladhisudunagu varusa bāvainavām̐ḍu jaladhi śhayanum̐ḍebo sakkani mādaivamu (||ādam̐ḍobo||) kŏṁḍa gŏḍuguganĕtti govulam̐gāsinavām̐ḍu kŏṁḍavaṁṭi rāgāsim̐ gŏṭṭinavām̐ḍu kŏṁḍalagu nĕkkuḍaina gurudu śhrīveṁkaḍādri- kŏṁḍarūbu dānebo korina mādaivamu