Title (Indic)ఆతఁడే నన్నందుకుఁగా అట్టె కూరిమి గొసరీ (రె?) WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే నన్నందుకుఁగా అట్టె కూరిమి గొసరీ (రె?) యీతలనాతల నీవే యెడమాఁట లాడేవా (॥ఆత॥) మాట మాటగా విభుని మంతనాన నాడుకొంటే చీటికిమాటికిఁ బోయి చెప్పుదురటే నీటున నాతనికి నే నీవంటిదాననేకానా యేఁటికే నీవొకతెవే యితవరివటవే (॥ఆత॥) అక్కవంటా నీతో నాతనిగుట్టు చెప్పితే కక్కసించి నీవు తారుకాణింతురా చక్కనిఇద్దరము సరివారమే కామా వెక్కసాన నాకంటె విశ్వాసివా (॥ఆత॥) నిగ్గులశ్రీవేంకటేశునేరుపు నీతో మెచ్చితే సిగ్గువడ నెఱుకలు సేసుకొందురా అగ్గమై నిన్నుఁ గూడినట్టె నన్నుఁ గూడితేను వెగ్గళించేవు నీవంటివేడుకే నాకును English(||pallavi||) ādam̐ḍe nannaṁdugum̐gā aṭṭĕ kūrimi gŏsarī (rĕ?) yīdalanādala nīve yĕḍamām̐ṭa lāḍevā (||āda||) māḍa māḍagā vibhuni maṁtanāna nāḍugŏṁṭe sīḍigimāḍigim̐ boyi sĕppuduraḍe nīḍuna nādanigi ne nīvaṁṭidānanegānā yem̐ṭige nīvŏgadĕve yidavarivaḍave (||āda||) akkavaṁṭā nīdo nādaniguṭṭu sĕppide kakkasiṁchi nīvu tārugāṇiṁturā sakkaniiddaramu sarivārame kāmā vĕkkasāna nāgaṁṭĕ viśhvāsivā (||āda||) niggulaśhrīveṁkaḍeśhunerubu nīdo mĕchchide sigguvaḍa nĕṟugalu sesugŏṁdurā aggamai ninnum̐ gūḍinaṭṭĕ nannum̐ gūḍidenu vĕggaḽiṁchevu nīvaṁṭiveḍuge nāgunu