Title (Indic)ఆతఁడే కావలెనంటే అట్టె పొందుసేసేఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే కావలెనంటే అట్టె పొందుసేసేఁ గాక యీతల నో చెలులాల యేల వేగిరించేరే (॥ఆత॥) మన్ననగలుగువా రేమాటలాడినా నింపులు కిన్నెరమీటుల గిలిగింపు లింపులు చన్నులు దాఁకఁ బెనఁగ సాదింపు లింపులు వున్నవారేమనినా నొద్దికౌనా పతికి (॥ఆత॥) చెంగటనున్నవా రేచేఁత సేసినా నింపులు వుంగరపువేలిసన్న లొగినింపులు సంగతి నద్దములోనిసరినీడ లింపులు జంగిలిసరసములు చవులౌనా పతికి (॥ఆత॥) ననపుగలుగువారినవ్వులెల్లా నింపులు తనివోనిజవ్వనమదము లింపులు పనితో నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడు వినయాన నన్ను నేలె వేసటౌనా పతికి English(||pallavi||) ādam̐ḍe kāvalĕnaṁṭe aṭṭĕ pŏṁdusesem̐ gāga yīdala no sĕlulāla yela vegiriṁchere (||āda||) mannanagaluguvā remāḍalāḍinā niṁpulu kinnĕramīḍula giligiṁpu liṁpulu sannulu dām̐kam̐ bĕnam̐ga sādiṁpu liṁpulu vunnavāremaninā nŏddigaunā padigi (||āda||) sĕṁgaḍanunnavā resem̐ta sesinā niṁpulu vuṁgarabuvelisanna lŏginiṁpulu saṁgadi naddamulonisarinīḍa liṁpulu jaṁgilisarasamulu savulaunā padigi (||āda||) nanabugaluguvārinavvulĕllā niṁpulu tanivonijavvanamadamu liṁpulu panido nalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu vinayāna nannu nelĕ vesaḍaunā padigi