Title (Indic)ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము (॥ఆతఁ॥) యెవ్వని పేరఁ బిలుతు రిలఁ బుట్టిన జీవుల నవ్వుచు మాసనక్షత్రనామములను అవ్వల నెవ్వని కేశవాదినామములే రవ్వగా నాచమనాలు రచియింతురు (॥ఆతఁ॥) అచ్చ మే దేవుని నారాయణనామమే గతి చచ్చేటివారికి సన్యాసమువారికి ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము (॥ఆతఁ॥) నారదుఁడు దలఁచేటి నామమది యెవ్వనిది గౌరి నుడిగేటి నామకథ యేడది తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము యీ రీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము English(||pallavi||) ādam̐ḍe brahmaṇyadaiva mādimūlamainavām̐ḍu ādani mānuḍalĕllā navidhibūrvagamu (||ādam̐||) yĕvvani peram̐ biludu rilam̐ buṭṭina jīvula navvusu māsanakṣhatranāmamulanu avvala nĕvvani keśhavādināmamule ravvagā nāsamanālu rasiyiṁturu (||ādam̐||) achcha me devuni nārāyaṇanāmame gadi sachcheḍivārigi sanyāsamuvārigi ichcha nĕvvarim̐ dalam̐si yitturu pidāḽlagu muchchaḍa nĕvvani nāmamulane saṁkalbamu (||ādam̐||) nāradum̐ḍu dalam̐seḍi nāmamadi yĕvvanidi gauri nuḍigeḍi nāmagatha yeḍadi tāragamai brahmarudradadi kĕvvarināmamu yī rīdi śhrīveṁkaḍādri nĕvvam̐ḍichchī varamu