Title (Indic)ఆతఁడదె నీ విదె అరగొరత లేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడదె నీ విదె అరగొరత లేఁటికే చేతిలోనివాఁ డితఁడు సిలుగు లింకేఁటికే (॥ఆతఁ॥) చలువైన నీమోముచంద్రుడు వెన్నెలగా చెలియ నీమతిలోని చీఁక టేఁటికే నిలువుఁ గొప్పుమేఘపు నీడలు నీమేన నిండె యెలమితో విరహపుటెండ లేఁటికే (॥ఆతఁ॥) వుదుటునీనాసికపుటూరుపుగాలి విసరీ చెదరుఁజెమటవానచిత్త డేఁటికే పదరమైఁదీగె బంగారు పసిమి దేరీ యిదె మోవిపండు వాడ నింతయేఁటికే (॥ఆతఁ॥) పొంచినవీచెక్కులనే పులకలపంట వండె యించుకనడిమికఱ విఁకనేఁటికే అంచెల శ్రీవేంకటేశుఁ డాతఁ డదె నిన్నుఁ గూడె మంచపు దొమ్ములలోన మంకు లిఁకనేఁటికే English(||pallavi||) ādam̐ḍadĕ nī vidĕ aragŏrada lem̐ṭige sedilonivām̐ ḍidam̐ḍu silugu liṁkem̐ṭige (||ādam̐||) saluvaina nīmomusaṁdruḍu vĕnnĕlagā sĕliya nīmadiloni sīm̐ka ṭem̐ṭige niluvum̐ gŏppumeghabu nīḍalu nīmena niṁḍĕ yĕlamido virahabuḍĕṁḍa lem̐ṭige (||ādam̐||) vuduḍunīnāsigabuḍūrubugāli visarī sĕdarum̐jĕmaḍavānasitta ḍem̐ṭige padaramaim̐dīgĕ baṁgāru pasimi derī yidĕ movibaṁḍu vāḍa niṁtayem̐ṭige (||ādam̐||) pŏṁchinavīsĕkkulane pulagalabaṁṭa vaṁḍĕ yiṁchuganaḍimigaṟa vim̐kanem̐ṭige aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ ḍadĕ ninnum̐ gūḍĕ maṁchabu dŏmmulalona maṁku lim̐kanem̐ṭige