Title (Indic)ఆడఁబోతే వచ్చి దోఁచీ నంతే చాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడఁబోతే వచ్చి దోఁచీ నంతే చాలు యీడ నాకుఁ దెలియుట కింగితమే చాలు (॥ఆడ॥) చెప్పరానిమాఁటలకు సెలవినవ్వే గురుతు అప్పటి నిన్నడిగానా అంతే చాలు వుప్పతిల్లే కూరిమికి వున్సరనుటే గురుతు ముప్పిరిఁ గొసరకుమీ మొదలిదే చాలు (॥ఆడ॥) పక్కన రమ్మనుటకు పవ్వళించుటే గురుతు యెక్కుడు సుద్దుల కేమి యింతేచాలు చిక్కి నాకు వేఁగుటకు చిరుఁజెమటే గురుతు నిక్కి చూడకుమీ ఇఁక నేలవ్రాఁతే చాలు (॥ఆడ॥) దిమ్మురతిఁ జొక్కుటకు తేలగింపులే గురుతు కమ్మర నలయించేనాకాఁగిలే నెమ్మది శ్రీవేంకటాద్రినిలియుఁడనైన నన్ను వుమ్మడిఁ గూడితిని యీ వొడఁబాటే చాలు English(||pallavi||) āḍam̐bode vachchi dom̐sī naṁte sālu yīḍa nāgum̐ dĕliyuḍa kiṁgidame sālu (||āḍa||) sĕpparānimām̐ṭalagu sĕlavinavve gurudu appaḍi ninnaḍigānā aṁte sālu vuppadille kūrimigi vunsaranuḍe gurudu muppirim̐ gŏsaragumī mŏdalide sālu (||āḍa||) pakkana rammanuḍagu pavvaḽiṁchuḍe gurudu yĕkkuḍu suddula kemi yiṁtesālu sikki nāgu vem̐guḍagu sirum̐jĕmaḍe gurudu nikki sūḍagumī im̐ka nelavrām̐te sālu (||āḍa||) dimmuradim̐ jŏkkuḍagu telagiṁpule gurudu kammara nalayiṁchenāgām̐gile nĕmmadi śhrīveṁkaḍādriniliyum̐ḍanaina nannu vummaḍim̐ gūḍidini yī vŏḍam̐bāḍe sālu