Title (Indic)ఆతఁ డొక్కటి సేయగా అట్టె వొకటి సేయ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డొక్కటి సేయగా అట్టె వొకటి సేయ- కీతరిఁ జేకొనరాదా యెలయించనేఁటికి (॥ఆత॥) ముప్పిరి నీరమణుఁడు మోహములు చల్లఁగాను రెప్పలెత్తి చూడరాదా రేసులేఁటికి తెప్పలుగా నవ్వఁగాను తేనె మోవి ఇచ్చి నీవు దప్పి దేరుచుఁగరాదా తప్పులెంచనేఁటికి (॥ఆత॥) చెలఁగి నీమేనబావ చెనకి పిలువఁగాను పలుకరాదా వట్టిపంతాలేఁటికి చెలిమి సేయఁగాను చేరి విడెమిచ్చి నీవు అలపారుచఁగరాదా అడ్డమాడనేఁటికి (॥ఆత॥) శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేకొని కలయఁగాను సేవలు సేయఁగరాదా సిగ్గు లేఁటికి యీవల నిన్నురమున యిడుకొని వుండఁగాను గావించి మెచ్చఁగరాదా పరవశమేఁటికి English(||pallavi||) ādam̐ ḍŏkkaḍi seyagā aṭṭĕ vŏgaḍi seya- kīdarim̐ jegŏnarādā yĕlayiṁchanem̐ṭigi (||āda||) muppiri nīramaṇum̐ḍu mohamulu sallam̐gānu rĕppalĕtti sūḍarādā resulem̐ṭigi tĕppalugā navvam̐gānu tenĕ movi ichchi nīvu dappi derusum̐garādā tappulĕṁchanem̐ṭigi (||āda||) sĕlam̐gi nīmenabāva sĕnagi piluvam̐gānu palugarādā vaṭṭibaṁtālem̐ṭigi sĕlimi seyam̐gānu seri viḍĕmichchi nīvu alabārusam̐garādā aḍḍamāḍanem̐ṭigi (||āda||) śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jegŏni kalayam̐gānu sevalu seyam̐garādā siggu lem̐ṭigi yīvala ninnuramuna yiḍugŏni vuṁḍam̐gānu gāviṁchi mĕchcham̐garādā paravaśhamem̐ṭigi