Title (Indic)ఆపెనేమీ ననరాదు అందములు చేసుకోనీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెనేమీ ననరాదు అందములు చేసుకోనీ యీపాటి చనవు చెలికియ్యవయ్య ఇఁకను (॥॥) చేరి చేరి యింతి నీకు సేవలెల్లాఁ జేయఁగాను గోరు దాఁకించెనంటాను కొచ్చి చూచేవు ఆరసి దూరవచ్చునో అవ్వలఁ జెప్పవచ్చునో వోరుచుక గుట్టుతోడ నుండవయ్య యిఁకను (॥॥) అంగన నీవద్దనుండి ఆకుమడిచియ్యఁగాను యెంగిలిసేసిచ్చెనంటా నీసడించేవు ముంగిటఁ జూపవచ్చునో ముంచి కడుగవచ్చునో చెంగలించి విడెము సేయవయ్య ఇఁకను (॥॥) వురముపై నుండి నిన్ను వువిద గాఁగిలించఁగా సరిఁ బాదాలూఁ దెనంటా సారె నవ్వేవు మరిగి పాయవచ్చునో మచ్చిక శ్రీవేంకటేశ సొరిది మోవిచవుల చూపవయ్య యిఁకను English(||pallavi||) ābĕnemī nanarādu aṁdamulu sesugonī yībāḍi sanavu sĕligiyyavayya im̐kanu (||||) seri seri yiṁti nīgu sevalĕllām̐ jeyam̐gānu goru dām̐kiṁchĕnaṁṭānu kŏchchi sūsevu ārasi dūravachchuno avvalam̐ jĕppavachchuno vorusuga guṭṭudoḍa nuṁḍavayya yim̐kanu (||||) aṁgana nīvaddanuṁḍi āgumaḍisiyyam̐gānu yĕṁgilisesichchĕnaṁṭā nīsaḍiṁchevu muṁgiḍam̐ jūbavachchuno muṁchi kaḍugavachchuno sĕṁgaliṁchi viḍĕmu seyavayya im̐kanu (||||) vuramubai nuṁḍi ninnu vuvida gām̐giliṁcham̐gā sarim̐ bādālūm̐ dĕnaṁṭā sārĕ navvevu marigi pāyavachchuno machchiga śhrīveṁkaḍeśha sŏridi movisavula sūbavayya yim̐kanu