Title (Indic)ఆపెకు నీకుఁ దెలుసు నవి యెట్టివేడుకలో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెకు నీకుఁ దెలుసు నవి యెట్టివేడుకలో పైపై సవతులము పచారించగలమా (॥ఆపె॥) వింతగా నీమోము చూచి వెలంది నీతో నవ్వె ఇంతలోనే గురుతులు యేమిగనెనో సంతోసముతోడ నీసంగడి నిలుచున్నది అంతరంగపుమాట యెట్టాసతి ఇచ్చితివో (॥ఆపె॥) సముకాన నప్పటిని సన్న సేసి నిను మెచ్చె తమకాన నీమేనేడ తన్ను సోఁకెనో చెమటలు గారఁగాను చేతులెత్తి నీకు మొక్కీ ప్రమదాన నెటువంటిపనులు సేసితివో (॥ఆపె॥) కందువ నలమేల్మంగ కాంగిలించుకొనె నిన్ను చెంది నీమన్నన నెట్టు చేకొనెనో యిందరి మమ్ము శ్రీవేంకటేశ యేలుకొంటివి పొంది నీదేవుల కెట్టు పొసంగఁ జెప్పితివో English(||pallavi||) ābĕgu nīgum̐ dĕlusu navi yĕṭṭiveḍugalo paibai savadulamu pasāriṁchagalamā (||ābĕ||) viṁtagā nīmomu sūsi vĕlaṁdi nīdo navvĕ iṁtalone gurudulu yemiganĕno saṁtosamudoḍa nīsaṁgaḍi nilusunnadi aṁtaraṁgabumāḍa yĕṭṭāsadi ichchidivo (||ābĕ||) samugāna nappaḍini sanna sesi ninu mĕchchĕ tamagāna nīmeneḍa tannu som̐kĕno sĕmaḍalu gāram̐gānu sedulĕtti nīgu mŏkkī pramadāna nĕḍuvaṁṭibanulu sesidivo (||ābĕ||) kaṁduva nalamelmaṁga kāṁgiliṁchugŏnĕ ninnu sĕṁdi nīmannana nĕṭṭu segŏnĕno yiṁdari mammu śhrīveṁkaḍeśha yelugŏṁṭivi pŏṁdi nīdevula kĕṭṭu pŏsaṁgam̐ jĕppidivo