Title (Indic)ఆపెకు నీకుఁ దెలుసు నటమీఁది పనులెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెకు నీకుఁ దెలుసు నటమీఁది పనులెల్లా చేపట్టి నేమింతకంటెఁ జెప్పఁగఁ జోటేది (॥ఆప॥) లోకములో నెవ్వతైనా లోఁచి మాటలాడఁగాను పైకొనవి వానికిఁ బంతమేది రాకలఁ బోకల నట్టె రాయడించి కొసరఁగ మైకొని లోఁగాకున్న మగతనమేది (॥ఆప॥) నంటున నెవ్వతెయైనా నవ్వులు సారె నవ్వఁగా యింటికి రాకున్నవాని యెరుకేది జంటలఁ దనమొకము సారె సారెఁ జూడఁగాను వెంటఁ దగులకున్నను విటతనమేది (॥ఆప॥) యెమ్మెచూపి యెవ్వతైనా యెదుటనే నిలుచుంటే నెమ్మిఁ గలయనివాని నేరుపేది కొమ్మను శ్రీవెంకటేశ కూడి నన్నుఁ గూడితివి సమ్మతి నిటుగాకున్న జాణతనమేది English(||pallavi||) ābĕgu nīgum̐ dĕlusu naḍamīm̐di panulĕllā sebaṭṭi nemiṁtagaṁṭĕm̐ jĕppam̐gam̐ joḍedi (||āba||) logamulo nĕvvadainā lom̐si māḍalāḍam̐gānu paigŏnavi vānigim̐ baṁtamedi rāgalam̐ bogala naṭṭĕ rāyaḍiṁchi kŏsaram̐ga maigŏni lom̐gāgunna magadanamedi (||āba||) naṁṭuna nĕvvadĕyainā navvulu sārĕ navvam̐gā yiṁṭigi rāgunnavāni yĕrugedi jaṁṭalam̐ danamŏgamu sārĕ sārĕm̐ jūḍam̐gānu vĕṁṭam̐ dagulagunnanu viḍadanamedi (||āba||) yĕmmĕsūbi yĕvvadainā yĕduḍane nilusuṁṭe nĕmmim̐ galayanivāni nerubedi kŏmmanu śhrīvĕṁkaḍeśha kūḍi nannum̐ gūḍidivi sammadi niḍugāgunna jāṇadanamedi