Title (Indic)ఆపె వల్ల వెలి తించుకంతా లేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె వల్ల వెలి తించుకంతా లేదు యేపునఁ జేసే సేవ విన్నియునుఁ జేసెను (॥ఆపె॥) సన్నలనే చూపదా సతి తా నుండేటి మేడ కన్నులనే మొక్కదా కడలనుండి విన్నవించదా వావి వేడుకతో నేకతాన కన్నెను నీ వేలుకోని కద మింతేకాక (॥ఆపె॥) తామెరల వేయదా తలఁపించి తలఁపించి మోము చూపి పొలయదా ముందర నిల్చి సాముసేసి పెనఁగదా సరసమాడే నెపాన కామించి చిత్త మెప్పుడు గరఁగీనోకాక (॥ఆపె॥) ఆకున వాసి చూపదా అట్టె తన విరహము వాకుచ్చి చెప్పదా లోలో వలపెల్లాను యీకడ శ్రీవేంకటేశ యీకె గూడితి వింతలో నీ కరుణ కిట్టానే నిలిచెనోకాకా English(||pallavi||) ābĕ valla vĕli tiṁchugaṁtā ledu yebunam̐ jese seva vinniyunum̐ jesĕnu (||ābĕ||) sannalane sūbadā sadi tā nuṁḍeḍi meḍa kannulane mŏkkadā kaḍalanuṁḍi vinnaviṁchadā vāvi veḍugado negadāna kannĕnu nī velugoni kada miṁtegāga (||ābĕ||) tāmĕrala veyadā talam̐piṁchi talam̐piṁchi momu sūbi pŏlayadā muṁdara nilsi sāmusesi pĕnam̐gadā sarasamāḍe nĕbāna kāmiṁchi sitta mĕppuḍu garam̐gīnogāga (||ābĕ||) āguna vāsi sūbadā aṭṭĕ tana virahamu vāguchchi sĕppadā lolo valabĕllānu yīgaḍa śhrīveṁkaḍeśha yīgĕ gūḍidi viṁtalo nī karuṇa kiṭṭāne nilisĕnogāgā