Title (Indic)ఆపె నందునో నిన్ను నందునో యీ చేఁతలకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె నందునో నిన్ను నందునో యీ చేఁతలకు యేపున వూరెల్లా పొందు లింతగాఁ జేసితివి (॥ఆప॥) యిద్దర మేకతమాడె యీవేళ మనవద్ద గుద్దిరాన నాపె వచ్చి కూచున్నది దిద్దరాదా అప్పేమైనఁ దీసుకొంటేఁ గనక నీ విద్దెస సతుల కస మింతగా నిచ్చితివి (॥ఆప॥) లోనికేఁగి నీవు నేను లోలత నవ్వుచుండఁగా తానువచ్చి నీకుఁబాదము లొత్తీని సేనగా నియ్యఁగరాదా జీఁతము చిక్కితేఁగన యీ నెపాన మందెమేళ మింతగాఁ జేసితివి (॥ఆప॥) వోరిచి ముసుఁగు వెట్టు కొగి నిన్నుఁ గూడితేను పేరున శ్రీవెంకటేశ పిలిచీ నాపె యీరాదా ఆపె సొమ్ము లెత్తుక వచ్చితేఁగన యీరీతి చనవు లిచ్చి యింతగాఁ బెంచితివి English(||pallavi||) ābĕ naṁduno ninnu naṁduno yī sem̐talagu yebuna vūrĕllā pŏṁdu liṁtagām̐ jesidivi (||āba||) yiddara megadamāḍĕ yīveḽa manavadda guddirāna nābĕ vachchi kūsunnadi diddarādā appemainam̐ dīsugŏṁṭem̐ ganaga nī viddĕsa sadula kasa miṁtagā nichchidivi (||āba||) lonigem̐gi nīvu nenu lolada navvusuṁḍam̐gā tānuvachchi nīgum̐bādamu lŏttīni senagā niyyam̐garādā jīm̐tamu sikkidem̐gana yī nĕbāna maṁdĕmeḽa miṁtagām̐ jesidivi (||āba||) vorisi musum̐gu vĕṭṭu kŏgi ninnum̐ gūḍidenu peruna śhrīvĕṁkaḍeśha pilisī nābĕ yīrādā ābĕ sŏmmu lĕttuga vachchidem̐gana yīrīdi sanavu lichchi yiṁtagām̐ bĕṁchidivi