Title (Indic)ఆపదలులేని సుఖమదియె పో విరతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపదలులేని సుఖమదియె పో విరతి వోపితేనే కైకొంట వొల్లకుంటే మానుట (॥ఆప॥) అలిగించు ములిగించు నంతలోనే భ్రమయించు కొలఁది సంసారపుగుణ మిది మలసి రాలుదింటా మలిగండ్లననేల వొలిసితేఁ గైకొంట వొల్లకుంటే మానుట (॥ఆప॥) ఆపపెట్టు మోసపెట్టు నంతలోనే వాసిపెట్టు గాసిల నీసిరులకు గల దిది వేసరి చానిపిఁ జవి వెదక నదిఁకనేల పూసివాసిఁ గైకొంట వొల్లకుంటే మానుట (॥ఆప॥) మరపించుఁ దలపించు మరి యేమైనాఁ జేసు మరియును దనకర్మమహిమిది గురిగా శ్రీవేంకటేశుఁ గొలిచినవారి కిది వుఱకైనఁ గైకొంట వొల్లకుంటే మానుట English(||pallavi||) ābadaluleni sukhamadiyĕ po viradi vobidene kaigŏṁṭa vŏllaguṁṭe mānuḍa (||āba||) aligiṁchu muligiṁchu naṁtalone bhramayiṁchu kŏlam̐di saṁsārabuguṇa midi malasi rāludiṁṭā maligaṁḍlananela vŏlisidem̐ gaigŏṁṭa vŏllaguṁṭe mānuḍa (||āba||) ābabĕṭṭu mosabĕṭṭu naṁtalone vāsibĕṭṭu gāsila nīsirulagu gala didi vesari sānibim̐ javi vĕdaga nadim̐kanela pūsivāsim̐ gaigŏṁṭa vŏllaguṁṭe mānuḍa (||āba||) marabiṁchum̐ dalabiṁchu mari yemainām̐ jesu mariyunu danagarmamahimidi gurigā śhrīveṁkaḍeśhum̐ gŏlisinavāri kidi vuṟagainam̐ gaigŏṁṭa vŏllaguṁṭe mānuḍa