Title (Indic)ఆఱడిఁబెట్టీ మమ్ము నంతేకాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఱడిఁబెట్టీ మమ్ము నంతేకాదా జాఱకున్నా మొక్కవచ్చీ సట లింతేకాదా (॥ఆఱ॥) అప్పసము వేగుదాఁకా నాకు మడిచి ఇచ్చితిఁ నప్పటి నన్నుఁ బిలిచీ నంతేకాదా పిప్పిగాఁ దనపాదాలే పిసికితి నిందాఁకాఁ జెప్పకవచ్చితిననీఁ జెప్పఁ గొత్తగాదా (॥ఆఱ॥) జాముదాఁకాఁ దనకు వెంజామరము వేసితి నేమి సేయుమనీ నన్ను నింతేకాదా దోమటినవ్వులు దనతోనే మారు నవ్వితి యేమో పరాకైతిననీ నిది వింతగాదా (॥ఆఱ॥) చేయారఁ బెనఁగితి చెరఁగు నన్నుఁ బట్టఁగా ఆయము లంటీ గోర నంతేకాదా యీయెడ శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁగూడె వేయిటికి నానవెట్టీ వేసా లింతేకాదా English(||pallavi||) āṟaḍim̐bĕṭṭī mammu naṁtegādā jāṟagunnā mŏkkavachchī saḍa liṁtegādā (||āṟa||) appasamu vegudām̐kā nāgu maḍisi ichchidim̐ nappaḍi nannum̐ bilisī naṁtegādā pippigām̐ danabādāle pisigidi niṁdām̐kām̐ jĕppagavachchidinanīm̐ jĕppam̐ gŏttagādā (||āṟa||) jāmudām̐kām̐ danagu vĕṁjāmaramu vesidi nemi seyumanī nannu niṁtegādā domaḍinavvulu danadone māru navvidi yemo parāgaidinanī nidi viṁtagādā (||āṟa||) seyāram̐ bĕnam̐gidi sĕram̐gu nannum̐ baṭṭam̐gā āyamu laṁṭī gora naṁtegādā yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ veyiḍigi nānavĕṭṭī vesā liṁtegādā