Title (Indic)ఱాలు దింటా మలిగండ్లాఱడి రాసిగా నేరేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఱాలు దింటా మలిగండ్లాఱడి రాసిగా నేరేము తేలుచు శ్రీహరి నీవే దిక్కౌట గాక (॥ఱాలు॥) ఆసలేల మానుఁ దన ఆఁకలి లో నుండఁగాను బేసబెల్లి దేహముతోఁ బెరుగుఁగాక గాసి బంధమేలఁమానుఁ గాముఁడు లో నుండఁగాను వేసట సంసారమై వెన్నడించుఁగాక (॥ఱాలు॥) ధావతులేఁటికి మానుఁ దనుభోగాలుండఁగాను మోవరాని చింతలతో ములుగుఁగాక కావరములేల మాను కంతల మేనుండఁగాను తోవ చేసుకొని వెళ్లఁదోయుచుండుఁగాక (॥ఱాలు॥) వొక్కచిత్తమేలయౌను వూర్పుగాలి విసరఁగా చిక్కి గుణత్రయముచేఁ జెదరుఁగాక నిక్కి శ్రీవేంకటపతి నీకు నేనే శరణంటి గక్కన నీజీవమును గరుణింతుగాక English(||pallavi||) ṟālu diṁṭā maligaṁḍlāṟaḍi rāsigā neremu telusu śhrīhari nīve dikkauḍa gāga (||ṟālu||) āsalela mānum̐ dana ām̐kali lo nuṁḍam̐gānu besabĕlli dehamudom̐ bĕrugum̐gāga gāsi baṁdhamelam̐mānum̐ gāmum̐ḍu lo nuṁḍam̐gānu vesaḍa saṁsāramai vĕnnaḍiṁchum̐gāga (||ṟālu||) dhāvadulem̐ṭigi mānum̐ danubhogāluṁḍam̐gānu movarāni siṁtalado mulugum̐gāga kāvaramulela mānu kaṁtala menuṁḍam̐gānu tova sesugŏni vĕḽlam̐doyusuṁḍum̐gāga (||ṟālu||) vŏkkasittamelayaunu vūrbugāli visaram̐gā sikki guṇatrayamusem̐ jĕdarum̐gāga nikki śhrīveṁkaḍabadi nīgu nene śharaṇaṁṭi gakkana nījīvamunu garuṇiṁtugāga