Title (Indic)అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం WorkOy! Year2009 LanguageTelugu Credits Role Artist Music Yuvan Shankar Raja Performer Shreya Ghoshal Writer Vanamaali LyricsTeluguపల్లవి: అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా .. నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా .. నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా ! చరణం 1: నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవెల్లే .. నా నవ్వులో జారినా రంగులేరుకోదా నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లై .. నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా రేగే నా ఊహల్ని ఊరేగనీ ... సాగే ఆ గువ్వల్ని ఓడించగా నా సైగకు తలవంచి ఆ మేఘమే ... చినుకల్లే నా ముందే వాలిందిగా ఒదిగున్న చిన్ని మనసే ... తొలి నడక నేచుకున్నదా ... ఇక ఉన్న చోటనే ఉంటుందా !!! చరణం 2: నిన్న లేని ఆ స్నేహమేదో నీడలాగ మారి .. నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి .. ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకి ... సాయంగా మారిందా ఆ స్నేహమే గుండెల్లో దాగున్న నా పాటకి ... రాగాలే నేర్పిందా ఈ బంధమే ఈ ఆశ జారిపోని ... తీరాన్ని చేరుకోనీ ... నూరేళ్ల జీవితం నాదవనీ !!! Englishpallavi: anugoledenāḍu ī logaṁ nāgosaṁ aṁdaṁgā mustābai uṁṭuṁdani ī kṣhaṇame sūstunnā ūrege veḍugalu ūriṁche ĕnnĕnno varṇālani kanibiṁche ī satyaṁ svapname anugonā .. nijamaṁṭe ĕvarainā nammane legunnā aṁdarilo innāḽḽu śhilanai unnā .. naḍisaṁdraṁlo īnāḍe alanayyānā ! saraṇaṁ 1: nīli niṁgilo teludunna kŏṁṭĕ vānavĕlle .. nā navvulo jārinā raṁgulerugodā nīḍi pŏṁgulo tuḽludunna siṭṭi seba pillai .. nā vegame immanī nannu korugodā rege nā ūhalni ūreganī ... sāge ā guvvalni oḍiṁchagā nā saigagu talavaṁchi ā meghame ... sinugalle nā muṁde vāliṁdigā ŏdigunna sinni manase ... tŏli naḍaga nesugunnadā ... iga unna soḍane uṁṭuṁdā !!! saraṇaṁ 2: ninna leni ā snehamedo nīḍalāga māri .. nā toḍugā serudū nannu vīḍanaṁdā unnabāḍugā ī prayāṇaṁ sāgudunna dāri .. pradi malubulo viṁtale nāgu sūbuduṁdā ī kalale tīrenā innāḽlagi ... sāyaṁgā māriṁdā ā snehame guṁḍĕllo dāgunna nā pāḍagi ... rāgāle nerbiṁdā ī baṁdhame ī āśha jāriboni ... tīrānni serugonī ... nūreḽla jīvidaṁ nādavanī !!!