Title (Indic)తోటలో నా రాజు తొంగి చూసెను నాడు WorkEkaveera Year1969 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Susheela Performer Ghantasala Writer Devulaballi LyricsTeluguపల్లవి: తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు చరణం 1: నవ్వులా అవి.. కావు నవ్వులా అవి కావు... నవ పారిజాతాలు నవ్వులా అవి కావు.. నవ పారిజాతాలు రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు ఆ రాజు ఈ రోజు అరుదెంచునా ఆ రాజు ఈ రోజు అరుదెంచునా అపరంజి కలలన్నీ చిగురించునా తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు చరణం 2: చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ అనురాగ మధుధారయై సాగనీ ఊఁహూఁహుఁ.. ఊఁహూఁహుఁ.. ఉఁహుఁహుఁ.... ఊఁహూఁహుఁ.. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు Englishpallavi: toḍalo nā rāju tŏṁgi sūsĕnu nāḍu nīḍilo ā rāju nīḍa navvĕnu neḍu toḍalo nā rāju tŏṁgi sūsĕnu nāḍu nīḍilo ā rāju nīḍa navvĕnu neḍu saraṇaṁ 1: navvulā avi.. kāvu navvulā avi kāvu... nava pārijādālu navvulā avi kāvu.. nava pārijādālu ravvaṁta saḍileni.. rasaramya gīdālu ravvaṁta saḍileni.. rasaramya gīdālu ā rāju ī roju arudĕṁchunā ā rāju ī roju arudĕṁchunā abaraṁji kalalannī siguriṁchunā toḍalo nā rāju tŏṁgi sūsĕnu nāḍu nīḍilo ā rāju nīḍa navvĕnu neḍu saraṇaṁ 2: sāḍugā pŏdariṁṭi māḍugā unnānu sāḍugā pŏdariṁṭi māḍugā unnānu pāḍalā dhara rāga bhāvanalu kannānu sāḍugā pŏdariṁṭi māḍugā unnānu pāḍalā dhara rāga bhāvanalu kannānu ĕla nāga nayanāla kamalālalo dāgi ĕla nāga nayanāla kamalālalo dāgi ĕdalona kadale tummĕda pāḍa vinnānu ĕdalona kadale tummĕda pāḍa vinnānu ā pāḍa nālo tiyyaga mroganī ā pāḍa nālo tiyyaga mroganī anurāga madhudhārayai sāganī ūm̐hūm̐hum̐.. ūm̐hūm̐hum̐.. um̐hum̐hum̐.... ūm̐hūm̐hum̐.. toḍalo nā rāju tŏṁgi sūsĕnu nāḍu nīḍilo ā rāju nīḍa navvĕnu neḍu