Title (Indic)ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది WorkEkaveera Year1969 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Susheela Performer Ghantasala Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది స్నేహంలో రేకులు విరిసి ..చిరునవ్వుల వెలుగు కురిసి స్నేహంలో రేకులు విరిసి ..చిరునవ్వుల వెలుగు కురిసి ఒక దీపం వెలిగింది.. ఒక రూపం వెలసింది ఒక దీపం మలిగింది.. ఒక రూపం తొలగింది ఒక దీపం మలిగింది ..ఒక రూపం తొలగింది వేకువ ఇక లేదని తెలిసి ..చీకటితో చేతులు కలిపి వేకువ ఇక లేదని తెలిసి ..చీకటితో చేతులు కలిపి ఒక దీపం మలిగింది ..ఒక రూపం తొలగింది చరణం 1: మంచు తెరలే కరిగిపోగా ..మనసు పొరలే విరిసిరాగా మంచు తెరలే కరిగిపోగా ..మనసు పొరలే విరిసిరాగా చెలిమి పిలుపే చేరుకోగ ..చెలియ వలపే నాదికాగా అనురాగపు మాలికలల్లి.. అణువణువున మధువులు చల్లి అనురాగపు మాలికలల్లి.. అణువణువున మధువులు చల్లి ఒక ఉదయం పిలిచింది... ఒక హృదయం ఎగిసింది చరణం 2: నింగి అంచులు అందలేక.. నేలపైన నిలువరాక నింగి అంచులు అందలేక ..నేలపైన నిలువరాక కన్నె కలలే వెతలుకాగా ..ఉన్న రెక్కలు చితికిపోగా కనిపించని కన్నీట తడిసి... బడబానల మెడలో ముడిచి కనిపించని కన్నీట తడిసి... బడబానల మెడలో ముడిచి ఒక ఉదయం ఆగింది ..ఒక హృదయం ఆరింది ఒక ఉదయం ఆగింది.. ఒక హృదయం ఆరింది ఒక దీపం వెలిగింది ...ఒక దీపం మలిగింది.. Englishpallavi: ŏga dībaṁ vĕligiṁdi.. ŏga rūbaṁ vĕlasiṁdi ŏga dībaṁ vĕligiṁdi.. ŏga rūbaṁ vĕlasiṁdi snehaṁlo regulu virisi ..sirunavvula vĕlugu kurisi snehaṁlo regulu virisi ..sirunavvula vĕlugu kurisi ŏga dībaṁ vĕligiṁdi.. ŏga rūbaṁ vĕlasiṁdi ŏga dībaṁ maligiṁdi.. ŏga rūbaṁ tŏlagiṁdi ŏga dībaṁ maligiṁdi ..ŏga rūbaṁ tŏlagiṁdi veguva iga ledani tĕlisi ..sīgaḍido sedulu kalibi veguva iga ledani tĕlisi ..sīgaḍido sedulu kalibi ŏga dībaṁ maligiṁdi ..ŏga rūbaṁ tŏlagiṁdi saraṇaṁ 1: maṁchu tĕrale karigibogā ..manasu pŏrale virisirāgā maṁchu tĕrale karigibogā ..manasu pŏrale virisirāgā sĕlimi pilube serugoga ..sĕliya valabe nādigāgā anurāgabu māligalalli.. aṇuvaṇuvuna madhuvulu salli anurāgabu māligalalli.. aṇuvaṇuvuna madhuvulu salli ŏga udayaṁ pilisiṁdi... ŏga hṛdayaṁ ĕgisiṁdi saraṇaṁ 2: niṁgi aṁchulu aṁdalega.. nelabaina niluvarāga niṁgi aṁchulu aṁdalega ..nelabaina niluvarāga kannĕ kalale vĕdalugāgā ..unna rĕkkalu sidigibogā kanibiṁchani kannīḍa taḍisi... baḍabānala mĕḍalo muḍisi kanibiṁchani kannīḍa taḍisi... baḍabānala mĕḍalo muḍisi ŏga udayaṁ āgiṁdi ..ŏga hṛdayaṁ āriṁdi ŏga udayaṁ āgiṁdi.. ŏga hṛdayaṁ āriṁdi ŏga dībaṁ vĕligiṁdi ...ŏga dībaṁ maligiṁdi..