Yivigo maa vinnabamu lichchagimchi vinavamma

యివిగో మా విన్నపము లిచ్చగించి వినవమ్మ
Language

(॥పల్లవి॥)
యివిగో మా విన్నపము లిచ్చగించి వినవమ్మ
యివల నాయకుఁడ నీ కిదే తగవయ్యా

(॥॥)
పన్నుకొన్న వినయాలు పడఁతులవి
మన్నించే నేరుపులు మగవానివి
సన్నల విలాసాలు సతులవి
యెన్నికైన చిఱునవ్వు లెప్పూడూఁ బ్రియునివి

(॥॥)
ఆసపడి కొసరేవి అంగనలవి
రాసి కెక్కఁ జెల్లించేవి రమణునివి
వాసులును వంతులును వనితలవి
వేసరని వోరుపులు విభునివి

(॥॥)
మంతనాలుఁ బంతనాలు మానినులవి
పొంత సిగ్గు లుడిపేవి పురుషునివి
యింతలో శ్రీ వేంకటేశుఁ డేలే నలమేల్మంగవు
సంతతపు మెచ్చు నీది సరస మాతనిది

(||pallavi||)
yivigo mā vinnabamu lichchagiṁchi vinavamma
yivala nāyagum̐ḍa nī kide tagavayyā

(||||)
pannugŏnna vinayālu paḍam̐tulavi
manniṁche nerubulu magavānivi
sannala vilāsālu sadulavi
yĕnnigaina siṟunavvu lĕppūḍūm̐ briyunivi

(||||)
āsabaḍi kŏsarevi aṁganalavi
rāsi kĕkkam̐ jĕlliṁchevi ramaṇunivi
vāsulunu vaṁtulunu vanidalavi
vesarani vorubulu vibhunivi

(||||)
maṁtanālum̐ baṁtanālu māninulavi
pŏṁta siggu luḍibevi puruṣhunivi
yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍele nalamelmaṁgavu
saṁtadabu mĕchchu nīdi sarasa mādanidi