యివి యే సుద్దులు మరి యేమడిగే విఁక మమ్ము
(॥పల్లవి॥)
యివి యే సుద్దులు మరి యేమడిగే విఁక మమ్ము
తివిరి చూతువుగా నీ దిష్టము రారాదా
(॥॥)
వుమ్మగిలు జవ్వనమే వుప్పతిల్లీ ఇరువంకా
కొమ్మకుఁ బెరిగి పెద్ద కొండ లాయను
పమ్మిన తమకములు పట్టరాక పిరుదులై
దిమ్ములు రేఁగి యిక దిబ్బ లాయను
(॥॥)
తలపోఁత లన్నియును తలనీలాలై నించి
చెలిఁ గప్పుకొని పెనుఁ జీఁకటాయను
వలపులు పిక్కటిల్లి వాడిగోళ్ళై కొనసాగి
ములుకులై చిన్నిమల్లెమొగ్గ లాయను
(॥॥)
నెఱి శ్రీ వేంకటేశుఁడ నీవు గూడఁగా మనసు
కఱఁ గెలమేల్మంగకుఁ గళ లాయను
జఱసి రతి పరవశములు మోవిమీఁది
గుఱుతులై రత్నాలకుప్ప లాయను
(||pallavi||)
yivi ye suddulu mari yemaḍige vim̐ka mammu
tiviri sūduvugā nī diṣhṭamu rārādā
(||||)
vummagilu javvaname vuppadillī iruvaṁkā
kŏmmagum̐ bĕrigi pĕdda kŏṁḍa lāyanu
pammina tamagamulu paṭṭarāga pirudulai
dimmulu rem̐gi yiga dibba lāyanu
(||||)
talabom̐ta lanniyunu talanīlālai niṁchi
sĕlim̐ gappugŏni pĕnum̐ jīm̐kaḍāyanu
valabulu pikkaḍilli vāḍigoḽḽai kŏnasāgi
mulugulai sinnimallĕmŏgga lāyanu
(||||)
nĕṟi śhrī veṁkaḍeśhum̐ḍa nīvu gūḍam̐gā manasu
kaṟam̐ gĕlamelmaṁgagum̐ gaḽa lāyanu
jaṟasi radi paravaśhamulu movimīm̐di
guṟudulai ratnālaguppa lāyanu