Yittumda valadaa yennigaina nee gunamu

యిట్టుండ వలదా యెన్నికైన నీ గుణము
Language

(॥పల్లవి॥)
యిట్టుండ వలదా యెన్నికైన నీ గుణము
అట్టే నిన్నుఁ జూచి నాకు నరుదాయను

(॥॥)
మక్కువ తోడుత నా మనసు నీవె యెఱిఁగి
చక్కెర నీ మోవియ్యఁగ సంతోసమాయ
తక్కక యప్పటి నా తమకము గనుఁగొని
వెక్కసాన నవ్వఁగాను వేడుకాయను

(॥॥)
వోముక నే విన్నవించే వుపమ నీకే తెలిసి
ఆ మాటే నాతో నాడఁగ నరు దాయను
కామించిన నాయాస గక్కన విచారించి
ప్రేమతోఁ గౌఁగిలించఁగ ప్రియ మాయను

(॥॥)
యిందు నా కళలలో నీ యిక్కువలు నీవే యంటి
అంది రతులఁ గూడఁగా నానంద మాయ
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
సందడి నన్నేలఁ గాను సమ్మతే యను.

(||pallavi||)
yiṭṭuṁḍa valadā yĕnnigaina nī guṇamu
aṭṭe ninnum̐ jūsi nāgu narudāyanu

(||||)
makkuva toḍuda nā manasu nīvĕ yĕṟim̐gi
sakkĕra nī moviyyam̐ga saṁtosamāya
takkaga yappaḍi nā tamagamu ganum̐gŏni
vĕkkasāna navvam̐gānu veḍugāyanu

(||||)
vomuga ne vinnaviṁche vubama nīge tĕlisi
ā māḍe nādo nāḍam̐ga naru dāyanu
kāmiṁchina nāyāsa gakkana visāriṁchi
premadom̐ gaum̐giliṁcham̐ga priya māyanu

(||||)
yiṁdu nā kaḽalalo nī yikkuvalu nīve yaṁṭi
aṁdi radulam̐ gūḍam̐gā nānaṁda māya
aṁdabu śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
saṁdaḍi nannelam̐ gānu sammade yanu.